Akshaya Tritiya: నేడే అక్షయ తృతీయ...బంగారం వ్యాపారంపై కరోనా పడగ

ఏటా అక్షర తృతీయ పండగకు హైదరాబాద్ దాదాపు రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతుందని చెబుతున్నారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఒక రూపాయి కూడా వ్యాపారం జరిగే పరిస్థితి లేదు.

news18-telugu
Updated: April 26, 2020, 11:45 AM IST
Akshaya Tritiya: నేడే అక్షయ తృతీయ...బంగారం వ్యాపారంపై కరోనా పడగ
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
Akshaya Tritiya| అక్షయ తృతీయ అంటే పసిడి పండగా అని అర్థం. ఈ పండగ రోజు ఎంతో కొంత బంగారం కొంటే చాలు.. సిరి సంపదలు సమకూరుతాయనేది ఓ నమ్మకం. కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో మే 3 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఫలితంగా బంగారు దుకాణాలు మూతపడ్డాయి. ప్రతి ఏటా అక్షర తృతీయ పండగకు బంగారు దుకాణాలు జనాలతో కిక్కిరిపోతుంటాయి. వ్యాపారులు సైతం రకరకాల ఆఫర్లు ప్రకటించి వినియోగదారుల మనసును గెలుచుకుంటున్నారు. ఏటా అక్షర తృతీయ పండగకు హైదరాబాద్ దాదాపు రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతుందని చెబుతున్నారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఒక రూపాయి కూడా వ్యాపారం జరిగే పరిస్థితి లేదు.

బంగారు కొనుగోళ్లపై వ్యాపారులు 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ప్రతి ఏటా బంగారు వ్యాపారం నుంచి జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్లు జరిగే సీజన్‌తోపాటు అక్షయ తృతీయ నేపథ్యంలో ఈ నెలలోనే సుమారు రూ.1000 కోట్ల మేర వ్యాపారం జరిగేది. నెల రోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో, ప్రస్తుతానికి ఈ సీజన్‌లో జీఎస్టీ రూపంలో ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది. లాక్‌డౌన్‌ కొనసాగితే ఇటు వ్యాపారులకు, అటు ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉంది. ప్రతి ఏటా అక్షయ తృతీయకు దుకాణాలు కళకళలాడుతంండేవి. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ముహూర్తాలు ఉన్నా లాక్‌డౌన్‌తో పెళ్లిళ్లు, ఫంక్షన్లను వాయిదా వేసుకున్నారు. దీంతో బంగారాన్ని కొనుగోలు చేసే వారు లేరు.
Published by: Krishna Adithya
First published: April 26, 2020, 11:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading