ఏపీని ఆ దేవుడే రక్షించాలి.. ధ్వజమెత్తిన చంద్రబాబు

కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆంబులెన్స్‌లో గొర్రెల మందలుగా ఎక్కించడం దారుణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: July 17, 2020, 2:58 PM IST
ఏపీని ఆ దేవుడే రక్షించాలి.. ధ్వజమెత్తిన చంద్రబాబు
చంద్రబాబు నాయుడు
  • Share this:
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆంబులెన్స్‌లో గొర్రెల మందలుగా ఎక్కించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రకమైన చర్యల కారణంగా వైరస్ లేని వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది 108 పబ్లిసిటీ కోసం చేస్తున్నారా ? లేక మరిన్ని కేసులు ఏపీలో పెంచేందుకు చేస్తున్నారా ? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక ఏపీని ఆ దేవుడే రక్షించాలి అంటూ టీడీపీ అధినేత ట్వీట్ చేశారు. జిల్లాలో కరోనా అనుమానితులను ఎక్కువ సంఖ్యలో 108 వాహనాలలో తరలిస్తున్న వీడియోను చంద్రబాబు తన ట్వీట్‌కు లింక్ చేశారు.



ఇక ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఏపీలో ఉన్న వారికి 2592, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,646కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరిలో కరోనా సునామీ సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ జిల్లాలో అత్యధికంగా 24 గంటల్లోనే 634 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తర్వాత గుంటూరులో 367, చిత్తూరు 328, కర్నూలు 315 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురంలో 297, శ్రీకాకుళం 149, నెల్లూరు 127, పశ్చిమ గోదావరి 109, విజయనగరం 89, కడప 55, ప్రకాశం 53, కృష్ణా 37, విశాఖపట్నం జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Published by: Kishore Akkaladevi
First published: July 17, 2020, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading