ఎమర్జెన్సీ కోసం మా ఎయిర్ లైన్స్ వాడుకోండి..ప్రభుత్వానికి గో ఎయిర్ సంస్థ ఆఫర్..

మెడికల్ ఎమర్జన్సీ సర్వీసుల విషయంలో రవాణకు తీవ్ర విఘాతం ఎదురువతోంది. ఈ నేపథ్యంలో అత్యవసర సేవల కోసం తమ విమానాలు వాడుకోవచ్చంటూ గో ఎయిర్ ప్రభుత్వానికి తెలిపింది.

news18-telugu
Updated: March 27, 2020, 1:48 PM IST
ఎమర్జెన్సీ కోసం మా ఎయిర్ లైన్స్ వాడుకోండి..ప్రభుత్వానికి గో ఎయిర్ సంస్థ ఆఫర్..
భారత్ నుంచి అమెరికా, ఫ్రాన్స్‌లకు.. ఆ దేశాల నుంచి భారత్‌కు నిత్యం విమానాలు నడుస్తాయి. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ భారత్, అమెరికా మధ్య జూలై 17 నుంచి జూలై 31 వరకు 18 విమానాలను నడపనుంది.
  • Share this:
దేశంలో లాక్ డౌన్ కారణంగా అత్యవసర సర్వీసులన్నీ చాలా ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా మెడికల్ ఎమర్జన్సీ సర్వీసుల విషయంలో రవాణకు తీవ్ర విఘాతం ఎదురువతోంది. ఈ నేపథ్యంలో అత్యవసర సేవల కోసం తమ విమానాలు వాడుకోవచ్చంటూ గో ఎయిర్ ప్రభుత్వానికి తెలిపింది. మెడికల్ ఎమర్జన్సీ విషయంలో పౌరులను చేరవేసేందుకు విమానాలు ఇస్తామని, అవసరమైన సిబ్బందిని కూడా సమకూరుస్తామని పేర్కొంటూ విమానయానశాఖ, డీజీసీఏలకు తెలియజేసింది. 56 విమానాలు ఉన్న గో ఎయిర్ సంస్థకు 5,500 మంది సిబ్బంది ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా దేశీయ విమాన సర్వీసులను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అన్ని సంస్థలకు చెందిన దాదాపు 650 విమానాలు పార్కింగ్ లో వున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలకు తమ విమానాలను వినియోగించుకోవచ్చంటూ గో ఎయిర్ ప్రభుత్వానికి సూచించింది.
Published by: Krishna Adithya
First published: March 27, 2020, 1:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading