GoAir: విమాన ప్రయాణికులకు క్వారెంటైన్ ప్యాకేజీ... ఒక రాత్రికి ఎంతో తెలుసా?

GoAir: విమాన ప్రయాణికులకు క్వారెంటైన్ ప్యాకేజీ... ఒక రాత్రికి ఎంతో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

GoAir Quarantine Packages | దేశంలోని వేర్వేరు నగరాల్లో క్వారెంటైన్ ప్యాకేజీలను అందిస్తోంది గోఎయిర్ ఎయిర్‌లైన్స్ సంస్థ.

  • Share this:
    బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ అయిన గోఎయిర్ విమాన ప్రయాణికులకు క్వారెంటైన్ ప్యాకేజీలను ప్రకటించింది. నగరాల్లో బడ్జెట్ హోటళ్ల నుంచి హైఎండ్ హోటల్స్ వరకు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులకు క్వారైంటైన్ ప్యాకేజీలను అందిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని గోఎయిర్ క్వారెంటైన్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలు ఒక రాత్రికి రూ.1,400 నుంచి ప్రారంభమవుతాయి. క్వారెంటైన్ పీరియడ్‌లో ఉండాల్సినన్ని రోజులు ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. విదేశాల నుంచి భారతదేశంలోని వేర్వేరు నగరాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లేవారు కూడా ఈ ప్యాకేజీలు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు కావాల్సిన హోటళ్లలో క్వారెంటైన్ సదుపాయాలు పొందొచ్చు. రూ.1,400 నుంచి ప్రారంభమయ్యే ప్యాకేజీ రూ.5,900 వరకు ఉంటుంది. నగరంతో పాటు ఎంచుకున్న హోటల్‌ను బట్టి ఈ ప్యాకేజీ మారుతుంది.

    CIBIL score: మీ క్రెడిట్ స్కోర్ తక్కువుందా? అయినా లోన్ తీసుకోవచ్చు ఇలా

    SBI: రాత్రి వేళ ఏటీఎంకు వెళ్తున్నారా? ఓటీపీతో డబ్బులు డ్రా చేయండి ఇలా

    GoAir quarantine packages, quarantine packages in India, Airlines quarantine packages, quarantine facilities, GoAir quarantine package price, quarantine packages in hyderabad, quarantine packages in mumbai, గోఎయిర్ క్వారెంటైన్ ప్యాకేజీ, క్వారెంటైన్ ప్యాకేజీ ధర, క్వారెంటైన్ ప్యాకేజీ హైదరాబాద్, క్వారెంటైన్ ప్యాకేజీ ముంబై
    ప్రతీకాత్మక చిత్రం


    భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇంకా ఉంది. పాజిటీవ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లోనే 34,956 కేసులు నమోదయ్యాయి. 687 మంది చనిపోయారు. మరోవైపు భారతదేశం నుంచి అమెరికా, ఫ్రాన్స్ దేశాల మధ్య విమాన సర్వీసులు మొదలయ్యాయి. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జూలై 17 నుంచి జూలై 31 వరకు 18 విమాన సర్వీసుల్ని నడపనుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ జూలై 18 నుంచి ఆగస్ట్ 1 మధ్య 28 సర్వీసుల్ని నడపనుంది. భారతదేశానికి చెందిన ఎయిర్ ఇండియా కూడా అమెరికా, ఫ్రాన్స్‌కు విమాన సర్వీసుల్ని అందిస్తోంది.
    Published by:Santhosh Kumar S
    First published: