Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తో లక్షల సొర చేపలకు ముప్పు.. ఎందుకంటే!

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అయితే ఈ వాక్సిన్ తయారీకి వేల సంఖ్యలో షార్క్ చేప‌ల‌‌ను సామూహికంగా చంపుతున్నార‌నే విష‌యం అనేక మందిని ఆందోళ‌న‌కు గురిచేస్తుంది.

news18-telugu
Updated: October 1, 2020, 2:33 PM IST
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తో లక్షల సొర చేపలకు ముప్పు.. ఎందుకంటే!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. కోవిడ్-19కు వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేందుకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. ఆ దేశాల్లో ఉన్న ఫార్మాకంపెనీలకు ఆయా ప్రభుత్వాలు అన్ని ర‌కాలుగా సాయం చేస్తున్నాయి. అయితే ఈ క్ర‌మంలో వేల సంఖ్యలో షార్క్ చేప‌ల‌‌ను సామూహికంగా చంపుతున్నార‌నే విష‌యం అనేక మందిని ఆందోళ‌న‌కు గురిచేస్తుంది.
షార్క్(సొర చేప‌) కాలేయం నుంచి ల‌భించే స‌హ‌జ‌ నూనెల సమ్మేళనాన్ని స్క్వాలేన్ అంటారు. దీన్ని క‌రోనా టీకాల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా అభివృద్ధి చేస్తోన్న టీకాల‌కు అవ‌స‌ర‌మ‌య్యేంత స్క్వాలేన్ సేక‌రించాలంటే వేలల్లో సొర చేప‌ల‌ను అంత‌మొందించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డానికి స్క్వాలేన్ తోడ్ప‌డుతుంది. టీకా సామ‌ర్థ్యాన్ని కూడా ఇది బ‌లోపేతం చేస్తుంది.

WHO ఏమంటోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO), రెగ్యులేటరీ ఎఫైర్స్ ప్రొఫెషనల్స్ సొసైటీ(RAPS) ప్రచురించిన స‌మాచారం ప్ర‌కారం... ప్ర‌పంచ వ్యాప్తంగా 176 వ‌ర‌కు క‌రోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నారు. వాటిలో సుమారు17 రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు ప్ర‌యోగిస్తున్నారు. వీటిలో క‌నీసం ఐదు వ్యాక్సిన్లను షార్క్ స్క్వాలేన్ ఆధారంగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు అమెరికాకు చెందిన షార్క్ అల్లీస్ అనే స్వ‌చ్ఛంద సంస్థ తెలిపింది. ఈ సంస్థ సొర చేప‌ల సంర‌క్ష‌ణ కోసం ప‌నిచేస్తోంది. ఈ వ్యాక్సిన్లు మంచి ఫ‌లితాలు ఇచ్చి, వాటిని ప్ర‌పంచం మొత్తానికి అందించాలంటే ట‌న్నుల కొద్దీ స్క్వాలేన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. దీని కోసం కొన్ని ల‌క్ష‌ల‌ సొర చేప‌ల‌ను అంత‌మొందించాల్సి ఉంటుంది.

ఐదు లక్షల సొర చేపలను చంపాల్సిందేనా?
సాధారణంగా ఒక డోసు టీకాకు సుమారు 9.75 mg స్క్వాలేన్ అవ‌స‌రం. ఈ లెక్క‌న చూస్తే భూమిపై ఉన్న ప్రతీ వ్యక్తికి ఒక డోసు టీకా కావాలంటే రెండు లక్షలకు పైగా సొరచేపలను చంపాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి డోసుల‌ను ఎక్కువ‌గా ఇస్తే.. సుమారు ఐదు ల‌క్ష‌ల‌ సొరచేపలను చంపాల్సిందే. ఇప్ప‌టికే కొన్ని ర‌కాల సొర చేప‌లు అంత‌రించే ద‌శ‌కు చేరుకున్నాయి. మహమ్మారికి విరుగుడుగా మాన‌వాళికి టీకా అందుబాటులోకి రావాలంటే, ఈ జీవ‌జాతుల‌ను అంత‌మొందించ‌డం స‌రికాద‌ని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప‌రిశ్ర‌మ అవ‌స‌రాల కోసం ఇప్ప‌టికే సొర చేప‌ల‌ను పెద్ద మొత్తంలో వేటాడుతున్నారు. సౌందర్య ఉత్ప‌త్తుల్లో ఎక్కువగా స్క్వాలేన్ ను ఉప‌యోగిస్తున్నారు.

అంత‌రించే దశలో సొర చేప..సౌందర్య ఉత్ప‌త్తుల్లో వాడే స్క్వాలేన్ కోసం ఇప్పటికే 2.7 మిలియన్ సొరచేపలను వేటాడిన‌ట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2024, 2027 నాటికి ఈ సంఖ్య రెండు, మూడు రెట్ల వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంద‌ని వారు అంచనా వేస్తున్నారు. దాదాపు ప‌ది ల‌క్ష‌ల వ‌రకు సొర చేప‌ల‌ను వాటి రెక్కల‌ కోసం వేటాడిన‌ట్లు అంచ‌నా. ఇలాంటివ‌న్నీ క‌లిసి సొర చేప‌ల‌ మనుగడకు ముప్పుగా మారాయి. సొరచేపలను సంర‌క్షించ‌డానికి కొంత‌మంది శాస్త్రవేత్తలు స్క్వాలేన్ ను కృత్రిమంగా త‌యారు చేస్తున్నారు. గోధుమ, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి వాటి నుంచి ప్లాంట్ బేస్‌డ్ స్క్వాలేన్ ను త‌యారు చేస్తున్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 1, 2020, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading