Corona Virus: సంక్షోభంలోనూ సంతోషం తగ్గదంతే.. పది మందిలో ఆరుగురు హ్యాపీయేనట..

ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్నది. ఇప్పటికీ దానికి టీకా ఎప్పుడస్తుంది..? ఎవరికిస్తారు..? అనే దానిమీద క్లారిటీ లేదు. అసలు వస్తుందా..? రాదా..? వస్తే ఎంతమేర సక్సెస్ అవుతుందనేది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా.. చిరునవ్వుతో అన్నింటినీ చేధిస్తామంటుంది ప్రపంచం. సంక్షోభంలోనూ సంతోషాన్ని వెతుక్కుంటున్నది.

news18
Updated: November 9, 2020, 12:37 PM IST
Corona Virus: సంక్షోభంలోనూ సంతోషం తగ్గదంతే..  పది మందిలో ఆరుగురు హ్యాపీయేనట..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 9, 2020, 12:37 PM IST
  • Share this:
మనిషి ఎన్ని తప్పొప్పులు చేసినా.. ప్రేమించినా.. పెళ్లాడినా.. క్షమించినా.. శిక్షించినా.. అంతెందుకు వ్యక్తులు తమకు తాము ఆలోచించి ఏది చేసినా అది దీని కోసమే. ఒక్క మాటలో చెప్పాలంటే తనను తాను సంతోషంగా ఉండటానికి మనిషి జీవితం కాలం కష్టపడతాడు. అయితే మనలో ఎంతమంది నిజంగా ఆనందంగా ఉన్నారు. అంటే ఆలోచించక తప్పదు. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకుంటే కరోనా ప్రభావంతో యావత్ ప్రపంచమే భయంతో వణికిపోతుంది. సంతోషమేమో గానీ ఈ గండం గడిస్తే చాలురా దేవుడా..? అనుకుంటూ ఇళ్లల్లో బందీ అయిపోతే సంతోషమెక్కడిది అనుకుంటున్నారా..? అయితే మీ అంచనా.. ఆలోచన రెండూ తప్పే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్నా.. ప్రతి 10 మందిలో ఆరుగురు పూర్తి సంతోషంతో ఉన్నారంట.

ఇప్సోస్ నిర్వహించిన 2020 గ్లోబల్ హ్యాపినెస్ సర్వేలో ఈ విషయం తేలింది. 27 దేశాల్లో ఈ సర్వే చేయగా 63 శాతం మంది ఆనందంగా ఉన్నామని చెప్పారు. సగం కంటే ఎక్కువ మంది ఆరోగ్యం విషయంలో సంతృప్తికరంగా ఉన్నారు. 2020లో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు, విషయాలు ఉన్నప్పటికీ సంతోషం విషయంలో 2019తో పోలిస్తే పెద్దగా వ్యత్యాసమేమి లేదని వారు తెలిపారు. గతేడాది 64 శాతం మంది తాము హ్యాపీగా ఉన్నట్లు తెలిపారు. ఏడాది కాలంలో ప్రజారోగ్యం విషయంలో ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నమోదయ్యాయి. అయితే 55 శాతం మంది ఆరోగ్యపరంగా తాము ఎంతో గొప్ప ఆనందంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

సంతోషం విషయంలో కుటుంబానికే అగ్రపీఠం..

ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్నా.. తాము మాత్రం తమ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉన్నట్లు 49 శాతం మంది తెలిపారు.  పిల్లలతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నట్లు  సుమారు 50 శాతం మంది స్పష్టం చేశారు. జీవితానికో అర్థముంటుందని, అది ఎంతో ముఖ్యమని 48 శాతం మంది  చెప్పారు.  సంతోషానికి సంబంధించి 10 కారణాలను పరిశీలిస్తే.. ఆరోగ్యం లేదా ఉపాధి(43 శాతం) అగ్రస్థానంలో ఉండగా.. సంతృప్తి (40 శాతం), ఎక్కువ డబ్బు కలిగి ఉండటం (40 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

కోవిడ్ కాలంలో ప్రాధాన్యతలు..
ఇప్సోస్ ప్రకారం.. 2019తో పోలిస్తే ఈ ఏడాది మరింత ఆనందానికి సంబంధించిన కారణాలు పెరిగాయి. కోవిడ్-19 సంక్షోభం ఎక్కువగా ఉన్నా బంధాలు, ఆరోగ్యం, భద్రతా లాంటి విషయాల్లో ఈ ఏడాది ఆందోళనలు కనబరుస్తున్నాయి. వారు చేసిన పనికి ఒకరిని క్షమించడం, వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం శారీరక శ్రేయస్సు, ఎవరినైనా కనుగొనడం ఈ నాలుగు పాయింట్లు 2019 కంటే పెరుగుదలను నమోదు చేశాయి. దేశాల్లో నూతన రాజకీయ నాయకత్వం సంతోష విషయంలో మూడు పాయింట్ల క్షీణతకు కారణమైంది.

Global happiness Survey 2020, Happiness, corona, covid-19, corona vaccine, corona pandemic, happiness news, happiness in around world

ప్రాంతీయ వైవిధ్యాలు..

ఇప్సోస్ సర్వే చేసిన 27 దేశాల్లో చైనా(93 శాతం) సంతోషకరమై దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మూడో స్థానంలో ఉన్న డ్రాగన్.. ఈ ఏడాది 11 పాయింట్లు మెరుగపరచుకుని అగ్రస్థానంలో నిలిచింది. కొత్తగా నెదర్లాండ్స్(87 శాతం), సౌదీ అరేబియా(80 శాతం) మూడో స్థానంలో ఉన్నాయి. గతేడాది ముందు వరుసలో ఉన్న కెనడా, ఆస్ట్రేలియా కిందకు దిగజారాయి. కెనడా 8 పాయింట్లు కోల్పోయి 78 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా.. రెండు పాయింట్లు కోల్పోయిన ఫ్రాన్స్ ఐదో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఏకంగా 9 పాయింట్లు దిగజారి 77 శాతంతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

అన్నింటికంటే అత్యంత తక్కువ ఆనందంగా ఉన్న దేశంగా పెరు గుర్తింపు తెచ్చుకుంది. 26 పాయింట్లు దిగజారి 32 శాతంతో అట్టడుగున ఉంది. గతేడాది కూడా ఈ దేశం అడుగునే ఉంది. కింద నుంచి మూడో స్థానంలో చిలీ(35 శాతం).. స్పెయిన్(38 శాతం) తర్వాత స్థానాల్లో నిలిచాయి.  ఇక అన్నింటికంటే ఎక్కువ పాయింట్ల కోల్పోయింది పెరు. ఈ దేశం 26 పాయింట్లు దిగజారింది. చిలీ 15 పాయింట్లు దిగజారగా.. మెక్సికో 13 పాయింట్లు కోల్పోయి 46 శాతంతో ఉంది.

10 మందిలో ఒకరు 'అత్యంత సంతోషం'గా ఉన్నారట..
27 దేశాలపై చేసిన సర్వే ప్రకారం 11 శాతం మంది అత్యంత సంతోషం (వెరీ హ్యాపీ)గా ఉన్నారని తెలిపారు. సగం కంటే ఎక్కువ మంది 52 శాతం మంది సంతోషంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. మరో పక్క 31 శాతం మంది అత్యంత ఆనందంగా లేమని బదులివ్వగా.. 6 శాతం మంది సంతోషంగా లేమని చెప్పారు. సౌదీ అరేబియాలో 30 శాతం మది పెద్దవారు అత్యంత ఆనందంగా ఉన్నారు. ఈ విషయంలో ఈ దేశమే టాప్. భారత్ 22 శాతం, నెదర్లాండ్స్ 20 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచాయి. ఇదే సమయంలో స్పెయిన్ దేశలో పెద్దవారిలో 13 శాతం వెరీ హ్యాపీగా లేమని చెప్పగా.. చిలీ, అర్జెంటీనా 12 శాతంతో, హంగరీ 11 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

సంతోషం విషయంలో గ్లోబల్ హ్యాపినెస్ స్థాయి తగ్గింది..
2011 నుంచి గ్లోబల్ హ్యాపీనెస్ లెవల్స్ బాగా తగ్గాయి. దాదాపు 14 పాయింట్లు దిగజారాయి. అంతేకాకుండా 2020లో 5 పాయింట్లు కోల్పోయి 17 దేశాల కంటే వెనకంజలో ఉంది. 2011 నుంచి చైనా ఒక్కటే మంచి మెరుగుదలను కనబర్చింది. దాదాపు 15 పాయింట్ల వృద్ధిని నమోదు చేసింది. ఇప్సోస్ సర్వేలో 27 దేశాలకు చెందిన 19,516 మంది పాల్గొన్నారు. ఈ సర్వే జులై 24 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహించారు.
Published by: Srinivas Munigala
First published: November 9, 2020, 12:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading