ప్రపంచవ్యాప్తంగా 32 లక్షలు దాటిన కరోనా కేసులు.. గజగజ వణుకుతున్న అమెరికా..

కరోనా.. 201 దేశాలను భయపెడుతున్న ఈ మహమ్మారి ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 32 లక్షలు దాటిపోయింది.

news18-telugu
Updated: April 30, 2020, 6:39 AM IST
ప్రపంచవ్యాప్తంగా 32 లక్షలు దాటిన కరోనా కేసులు.. గజగజ వణుకుతున్న అమెరికా..
ప్రతీకాత్మక చిత్రం (credit - trackcorona.live)
  • Share this:
కరోనా.. 201 దేశాలను భయపెడుతున్న ఈ మహమ్మారి ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 32 లక్షలు దాటిపోయింది. బుధవారం నాడు మొత్తం కేసుల సంఖ్య 31,35,509 ఉండగా 24 గంటల్లోనే ఆ సంఖ్య 32,19,240కి చేరింది. కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 2,28,190కి చేరింది. ఆశాజనక విషయం ఏంటంటే.. 10 లక్షల మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. ప్రస్తుతానికి ఆ సంఖ్య 10,00,101కు చేరింది. అటు.. యాక్టివ్ కేసుల సంఖ్య 19,90,949గా ఉంది. అందులో 59,808 మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కాగా, అమెరికా కరోనా వైరస్‌తో గజగజ వణికిపోతోంది. 24 గంటల్లోనే 2,390 మందిని ఈ ప్రాణాంతక వైరస్ పొట్టనబెట్టుకుంది. ఆ దేశంలో కొత్తగా 28,429 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 10,64,194కు చేరింది.

కరోనాతో నిన్న ఒక్క రోజే యూకేలో 795 మంది చనిపోయారు. స్పెయిన్‌లో 453, బ్రెజిల్‌లో 448, ఫ్రాన్స్‌లో 427, ఇటలీలో 323, బెల్జియంలో 170, జర్మనీలో 153, నెదర్లాండ్స్‌లో 145, కెనడాలో 137, మెక్సికోలో 135, స్వీడన్‌లో 107, రష్యాలో 105 మంది చనిపోయారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 30, 2020, 6:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading