Home /News /coronavirus-latest-news /

GIFTS AND LUCKY DRAW FOR CORONA WHO VACCINATED IN MAHARSHTRA VRY

Corona vaccine : టీకా లక్కి డ్రా.. రిఫ్రిజిరేటర్.. వాషింగ్ మిషన్.. ఇలా ఎన్నో బహుమతులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Corona vaccine : దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ వేసుకునేందుకు అనేకమంది ముందుకు వస్తున్నా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాత్రం వ్యాక్సిన్‌పై అవగాహన లేకపోవడంతో పాటు పలు కారణాలతో ముందుకు రావడం లేదు.. దీంతో పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వచ్చేవారికి ప్రోత్సహక బహుమతులు ప్రకటిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవడంపై పలు దేశాలతోపాటు ఆయా దేశాల్లోని రాష్ట్రాలు, ప్రాంతాల వారిగా అనేక నిబంధనలు విధించారు. అయినా చాలా మంది వ్యాక్సిన్ వేయించుకునేందకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అయితే వ్యాక్సిన్ ప్రారంభంలో చాలా దేశాలు కొన్ని ప్రోత్సహాలు కూడా ప్రకటించాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వ్యాపార సంస్థలు కూడా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి అనేక ప్రోత్సహాకాలు ప్రకటించి తమ వ్యాపార అభివృద్దితోపాటు ప్రజల్లో అవగాహన కల్పించారు. అయినా ముందుకు రాకపోవడంతో.. కఠిన నిబంధనలు సైతం తీసుకువచ్చారు. వ్యాక్సిన్ వేసుకోని వారికి.. ప్రభుత్వ పథకాలతో పాటు ఇతర నిబంధనలు, నిర్భంధాలు కొనసాగిస్తున్నారు.

    అయితే.. తాజాగా మహారాష్ర్టలోని చంద్రాపుర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాత్రం వీటికి భిన్నంగా స్పందించింది. టీకాలు తీసుకొన్న పౌరులకు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించారు. దీంతో అక్కడ టీకా వేయించుకొన్న వారి పేర్లను లక్కీడ్రా తీసి విజేతలకు బహుమతులను ఇవ్వనున్నారు.
    నవంబరు 12- 24 వరకూ టీకా తీసుకునే వారికి వీటిని గెలుచుకునే అవకాశం ఉన్నట్లు బుధవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు పౌరులు తమ సమీపంలోని ఆరోగ్యకేంద్రాలకు వెళ్లి టీకాలు వేయించుకోవాలని కమిషనర్ రాజేష్ మోహితే విజ్ఞప్తి చేశారు.

    ఇది చదవండి  : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి కౌంటర్ అటాక్.. ఎయిమ్స్‌పై వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్.. !


    ఇక లక్కీ డ్రాలో తొలి బహుమతిగా రిఫ్రిజిరేటర్‌, రెండో బహుమతిగా వాషింగ్‌ మిషన్‌, మూడో బహుమతిగా ఎల్‌ఈడీ టీవీ ఇస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు మరో 10 మందికి మిక్సర్-గ్రైండర్లను ప్రోత్సాహక బహుమతులుగా ఇవ్వనున్నారు. అత్యవసర సేవల విభాగంలో పని చేసేవారితో పాటు దుకాణదారులు కచ్చితంగా ఒక డోస్‌ టీకా తీసుకున్నట్లు సర్టిఫికేట్‌ను చూపించాల్సి ఉంటుందని.. లేదంటే వారిని నగరంలోని మార్కెట్‌ల్లోకి అనుమతించమని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 30లోపు వారు టీకా రెండుడోసులను కచ్చితంగా తీసుకోవాలని కోరారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Corona, Corona Vaccine

    తదుపరి వార్తలు