హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

GHMC మేయర్ డ్రైవర్ కి కరోనా..మళ్లీ టెస్టుకు బొంతు రామ్మోహన్‌‌..

GHMC మేయర్ డ్రైవర్ కి కరోనా..మళ్లీ టెస్టుకు బొంతు రామ్మోహన్‌‌..

GHMC మేయర్ బొంతు రామ్మోహన్ (Image:Facebook)

GHMC మేయర్ బొంతు రామ్మోహన్ (Image:Facebook)

డ్రైవర్‌కు కరోనా అని తేలడంతో మేయర్‌‌ కుంటుంబం హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. నేడు మేయర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే నాలుగు రోజుల క్రితమే బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగటివ్‌ అని తేలింది.

ఇంకా చదవండి ...

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్‌ కరోనా బారిన పడ్డాడు. అతడు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు వెల్లడించడంతో. అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. విధుల్లో భాగంగా గత కొన్నాళ్ళ నుండి బాధితుడు అయిన డ్రైవర్, మేయర్ వెంటనే ఉంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిన ఉదయం వరకూ మేయర్‌ వెంటే ఉన్నాడు. ఇక ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం అతడు ఎవరెవరిని కలిశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. డ్రైవర్‌కు కరోనా అని తేలడంతో మేయర్‌‌ కుంటుంబం హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. నేడు మేయర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే నాలుగు రోజుల క్రితమే బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగటివ్‌ అని తేలింది.

స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్‌లో మేయర్‌ టీ తాగారు. అయితే ఆయన ఆ టీ తాగి వెళ్ళాక ఆ దుకాణంలో పనిచేసే టీ మాస్టర్‌కు కరోనా సోకినట్లు తేలింది. విషయం తెలుసుకున్న అధికారులు.. వైద్యులకు సమాచారం ఇవ్వడంతో ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగటివ్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఆయన డ్రైవర్ కి కరోనా సోకడంతో అందరినీ ఆందోళన కలిగిస్తోంది.

First published:

Tags: Corona virus, Coronavirus, Covid-19, Telangana, Telangana Election 2018

ఉత్తమ కథలు