హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Vaccination : వ్యాక్సిన్ వేసుకుంటే ఫ్రీ బీరు... విందు..వినోదాలు..ఇంకా అక్కడ చాలా గిఫ్ట్స్ ..

Vaccination : వ్యాక్సిన్ వేసుకుంటే ఫ్రీ బీరు... విందు..వినోదాలు..ఇంకా అక్కడ చాలా గిఫ్ట్స్ ..

 అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వార చేయనున్నారు..ప్రారంభంలో పట్టణ ప్రాంతలతో పాటు 

ఆయా సెంటర్లలో ఇదే విధమైన పద్దతి ఉండేది..టీకా వేయించుకునే వారి ఆధార్ కార్డు తీసుకువెళితే వారు దాని 

ద్వార రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వ్యాక్సిన్ వేసేవారు..ఇప్పుడు కూడా అదే పద్దతిని గ్రామీణ ప్రాంత ప్రజలకు 

కల్పించారు.

అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వార చేయనున్నారు..ప్రారంభంలో పట్టణ ప్రాంతలతో పాటు ఆయా సెంటర్లలో ఇదే విధమైన పద్దతి ఉండేది..టీకా వేయించుకునే వారి ఆధార్ కార్డు తీసుకువెళితే వారు దాని ద్వార రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వ్యాక్సిన్ వేసేవారు..ఇప్పుడు కూడా అదే పద్దతిని గ్రామీణ ప్రాంత ప్రజలకు కల్పించారు.

Vaccination : అగ్రదేశాలకు, వర్థమాన దేశాలకు మధ్య తేడా అంటే ఇదే... భారత దేశంలో టీకాల కోసం జనం కిలోమీటర్ల మేర క్యూల్లో నిలుచుంటే..అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో తాయిళాలు ప్రకటిస్తున్న పరిస్థితి నెలకొంది..

ఇంకా చదవండి ...

వ్యాక్సిన్ కొరత భారత దేశాన్ని పట్టి పీడిస్తుంది..వ్యాక్సిన్ కోసం ప్రజలు పడిగాపులు పడుతున్నారు. కాని విదేశాల్లో మాత్రం వ్యాక్సిన్ వేసుకునే వారు కరువయ్యారు..దీంతో వ్యాక్సిన్ వేసుకునే వారికి నజరానాలు ప్రకటిస్తున్నారు స్థానిక ప్రభుత్వాలు..మరియు ప్రైవేటు కంపనీలు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి బీరుతో పాటు, లాటరీ టికెట్స్, ఇతర నజరానాలు ప్రకటించింది అగ్ర దేశ రాష్ట్రాలు..మరోవైపు న్యూయార్క్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఏకంగా గవర్నర్‌తో లంచ్ సైతం ఏర్పాటు చేసింది.

కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసిన దీని అవసరమే ఎక్కువగా ఉంది..దీని తర్వాతే ఏదైన అనేట్టు ప్రపంచమంతా వెతుకుంది..దీని కొరత వెనకబడిన దేశాల్లో విపరీతంగా ఉంటే..అగ్రదేశం అమెరికాలో మాత్రం మరో రకమైన విచిత్ర పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అమెరికా అన్ని దేశాల కంటే ముందే వ్యాక్సిన్ కొనుగోలు చేసి నిల్వ చేసుకుంది..ఒకదశలో ఆ దేశ అవసరాల కంటే ఎక్కువే ఆదేశం వ్యాక్సిన్ నిల్వలను సమకూర్చుకుందని చెబుతున్నారు.

ఈ నేపధ్యంలోనే అమెరికా ఇంత చేసినా.. ఇప్పటి వరకు ఆదేశ జనాభాలోని సగం మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. అంటే మొత్తం 33 కోట్ల జనాభాలో కేవలం 16 కోట్లు మాత్రమే టీకా వేయించుకున్నట్టు అధికారికి లెక్కలు చెబుతున్నాయి. కాగా రెండు డోసులు వేసుకున్నవారు మాత్రం 12 కోట్ల మంది మాత్రమే అని చెబుతున్నారు..అయితే ఒక్కరోజులోనే సుమారు నలబై నుండి యాబై లక్షల వరకు టీకాల కోసం పోటెత్తిన ప్రజల ఉత్సాహం ప్రస్తుతానికి రోజుకు పది లక్షలు కూడ దాటటడం లేదని గణంకాలు చెబుతున్నాయి. మరోవైపు ఇటివలే అమెరికా మాస్క్‌లు లేకుండా తిరిగేందుకు అవకాశం కూడ ఇచ్చారు... ఇలా అయితే థర్డ్ వేవ్‌ను తట్టుకోవడం కూడ కష్టంగా మారుతుందని భావిస్తున్న అగ్రదేశంలోని పలు రాష్ట్రాలు, వ్యాక్సిన్ కంపనీలు వ్యాక్సిన్ వేసుకునేందుకు తాయిళాలు ప్రకటిస్తున్నాయి..

ముఖ్యంగా ఎండాకాలం కావడంతో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఉచిత బీరును కొన్ని రాష్ట్రాల్లో ప్రకటించగా మరి కొన్ని ప్రాంతాల్లో అయితే పార్కుల్లో ఉచిత ప్రవేశంతోపాటు 50 లక్షల డాలర్ల లాటరీలు, ఉచిత ప్రయాణాల లాంటీ నజరానాలను ప్రకటించగా, రెస్టారెంట్స్‌లలో ఉచిత భోజనం ,వర్జీనియా రాష్ట్రంలో అయితే సేవింగ్ బాండ్స్ సైతం ప్రకటించారు. ఇలా ఓక్కో రాష్ట్రం ఒక్కో స్టైల్లో టీకా వేయించుకునేందుకు తాయిళాలు ప్రకటించగా.. ఇక న్యూయార్క్ రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా గవర్నర్ దంపతులతో కలిసి భోజనం ఏర్పాటును ప్రకటించింది..ఇందుకోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న అనంతరం లాటరీ ద్వార ఎంపిక చేస్తామని ప్రకటించింది.

కాగా ఇండియాలో రెండు నెలల క్రితం ఇదే పరిస్థితి కనిపించింది. 45 సంవత్సరాలకు పై బడిన వారు వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్రం ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు..దీంతో గుజరాత్‌లోని ఓ రెస్టారెంట్ ఇదే రీతిలో టీకా వేసుకో బీరు తీసుకుపో అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది..కాని సెకండ్ వేవ్ ఉదృతమైన తర్వాత ఆ పరిస్థతి మారింది.. వ్యాక్సిన్ కోసం అటు ప్ర్రైవేటు ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద కిలో మీటర్ల కొద్ది క్యూలు దర్శనమిస్తున్నాయి.

Published by:yveerash yveerash
First published:

Tags: America, Corona Vaccine

ఉత్తమ కథలు