Covid-19: అక్కడ మళ్లీ లాక్డౌన్.. కరోనా కేసులు పెరుగుతుండటంతో జర్మన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

పలు దేశాల్లో విస్తృతి తగ్గినా.. కరోనా మాత్రం ఇంకా తన పంజా విసిరుతూనే ఉంది. కొన్నాళ్లుగా ఈ మహమ్మారి అదుపులోకి వస్తుందనుకుంటున్న తరుణంలో జర్మనీ లో మరోసారి విజృంభిస్తున్నది.

 • News18
 • Last Updated :
 • Share this:
  ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మరలా విజృంభిస్తున్నాయి. భారత్ తో సహా కొన్ని దేశాలు కరోనా నుండి నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో జర్మనీలో మాత్రం కరోనా తీవ్రత మళ్లీ ఎక్కువైంది. అక్కడ ఉన్నట్టుండి కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పేషెంట్లతో ఆసుపత్రులు నిండిపోతుండం, వైరస్ సంబంధిత మరణాలు పెరిగిపోతుండటంతో జర్మనీ మరోసారి లాక్డౌన్ విధించడానికి సన్నద్ధమవుతుంది. దీనిలో భాగంగా రెస్టారెంట్లు, జిమ్ లు, థియేటర్లు వంటి వాటిని నెల రోజుల పాటు మూసివేయాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ పేర్కొన్నారు.

  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మోర్కెల్ మాట్లాడుతూ.. " దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున తక్షణమే మరోసారి లాక్డౌన్ విధించాల్సిన అవసరం ఉంది.’’ అని అన్నారు. దీనిలో భాగంగా లాక్డౌన్ నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. నవంబర్ 2 నుండి అమలు కానున్న ఈ లాక్డౌన్లో భాగంగా కేవలం 10 మందితోనే ప్రైవేట్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లు, సినిమా ఘూటింగ్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ సెంటర్లు అన్నీ మూసివేయబడతాయి. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ప్రేక్షకులు లేకుండా జరపాల్సి ఉంటుంది. అయితే, పాఠశాలలు, డే కేర్ సెంటర్స్ మాత్రం తెరిచి ఉంటాయి. దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం మరియు పరిశుభ్రత నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

  చిన్న సంస్థలకు ఆర్థిక సాయం:  కొత్త ఆంక్షల వల్ల ఇబ్బందులు పడే చిన్న కంపెనీలకు జర్మనీ ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని కోసం 10 -బిలియన్ -యూరో (11.82 బిలియన్ డాలర్ల) సహాయ ప్యాకేజీని ప్రకటించింది. తద్వారా 50 మంది ఉన్న చిన్న కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వారి మొత్తం సంవత్సరపు ఆదాయంలో 75 శాతాన్ని నవంబర్ నెలలో పొందుతాయి. అంతేకాక,10 కంటే తక్కువ ఉద్యోగులతో నడుస్తున్న చిన్న సంస్థలకు సహాయం చేయడానికి ఇప్పటికే అమల్లో ఉన్న లిక్విడిటీ ప్రోగ్రామ్ను జర్మనీ ప్రభుత్వం విస్తరిస్తుంది.

  24 గంటల్లో 14,964 కేసుల నమోదు..
  యూరోప్ దేశాలన్నింటిలో అతిపెద్ద ఆర్ధికవ్యవస్థను కలిగిన జర్మనీ, మహమ్మారి సంక్షోభ మొదటి దశలో వ్యాధి సంక్రమణ, మరణాల రేటును దాని పొరుగు దేశాల కంటే చాలా తక్కువగా నమోదు చేసింది. కాని, ప్రస్తుతం మిగిలిన యూరప్ దేశాల మాదిరిగానే అక్కడ కేసుల తీవ్రత పెరుగుతోంది. గత 24 గంటల్లో 14,964 కేసులు పెరగగా అక్కడ మొత్తం కేసుల సంఖ్య 4,64,239 కు చేరుకుందని జర్మనీ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ ఏజెన్సీకి చెందిన రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది.
  మహమ్మారి సమసిపోతున్న క్రమంలో కేసుల సంఖ్య భారీగా పెరిగి బ్రేకింగ్ పాయింట్ ను తాకవచ్చని ఛాన్సలర్ మోర్కెలా హెచ్చరించడంతో ఆరోగ్య వ్యవస్థలో భయాలు పెరిగాయి. అయితే, ‘మా ఆరోగ్య వ్యవస్థ నేటికీ ఈ సవాలును ఎదుర్కోగలదని, ఈ మహమ్మారి వేగంగా వృద్ధి చెందిన మరి కొద్ది వారాల్లోనే దాని పీక్ స్టేజ్ కు చేరుకొని క్రమంగా తగ్గుతుందని’అని ఆమె అభిప్రాయపడ్డారు.

  ఈ మహమ్మారిని అంతం చేసేందుకు తాము నాలుగు వారాల పాటు లాక్డౌన్ ప్రకటిస్తున్నామని.. దీన్ని సరిగ్గా చేయగలిగితే, మహమ్మరి నుంచి దేశ ప్రజలను కాపాడుకోవచ్చు" అని బెర్లిన్ మేయర్ మైఖేల్ ముల్లెర్ చెప్పారు. నూతన చర్యల ప్రభావాన్ని అంచనా వేయడానికి జర్మన్ ఛాన్సలర్ మెర్కెల్ మరియు 16 రాష్ట్ర ప్రభుత్వ నాయకులు రెండు వారాల్లో తిరిగి సమావేశం కానున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: