అక్కడ మరో రెండు వారాలు లాక్ డౌన్...

టాప్ 1. కర్నూలు (101)

ఏప్రిల్ 19 వరకు కొత్తగా ఆంక్షలను పొడిగిస్తూ జర్మనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    జర్మనీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాల పాటు ప్రజలకు ఆంక్షలు విధించింది. అంటే ఏప్రిల్ 19 వరకు కొత్తగా ఆంక్షలను పొడిగిస్తూ జర్మనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మార్కెల్ గతంలో ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఆ ఆంక్షలను మరో రెండు వారాలు ఏప్రిల్ 19వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం జర్మనీలో 74,508 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. 821 మంది చనిపోయారు. ఒక్కరోజులో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 16,100 మంది కోలుకున్నారు. ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో ఎక్కువ కరోనా పాజిటివ్ (189754) కేసులు ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో ఇటలీ, స్పెయిన్, చైనా ఉన్నాయి. ఆ నాలుగింటి తర్వాత ఐదో స్థానంలో జర్మనీ ఉంది. ప్రజలు ఎవరూ ఎలాంటి హాలిడేస్ ప్లాన్ చేసుకోవద్దని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, లగ్జెంబర్గ్, డెన్మార్క్‌లతో సరిహద్దులను మూసివేసింది. జర్మనీ వారు కాకుండా, బయటి వారికి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా దేశంలోకి అనుమతించరు. స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: