Home /News /coronavirus-latest-news /

GERMAN LEADERS PLAN CRACKDOWN ON UNJABBED TO TACKLE COVID SURGE VB

Lockdown: మళ్లీ అక్కడ షరతులతో కూడిన లాక్ డౌన్.. వ్యాక్సిన్ తీసుకోని వారికి హెచ్చరికలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Lockdown: కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త రూపంతో ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ వైరస్ పై అప్రపత్తం అయ్యాయి.

  కరోనా మహమ్మారి (Corona) తగ్గినట్లే తగ్గి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రెండు వేవ్(Second Wave) లతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలు మళ్లీ మరో వేవ్ ముంచుకొస్తోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త రూపంతో ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) తో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ వైరస్ పై అప్రపత్తం అయ్యాయి. మొన్నటికి ఆరు దేశాల్లో ఉనికి చాటుకున్న ఈ నయా మహమ్మారి ఇప్పుడు 20కి పైగా దేశాల్లో వెలుగుచూసింది. ఈ క్రమంలో యూరప్ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో జర్మనీలోనూ కఠిన ఆంక్షలకు తెరలేపారు. దేశంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు జర్మనీ ప్రభుత్వం ప్రకటన చేసింది.

  Married Women: ముగ్గురు పిల్లల తల్లిపై అలా ఎలా చేయాలనిపించిందయ్యా నీకు.. చివరకు ఏమైందో చూడు..


  షరతులతో కూడిన లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఓలాఫ్‌ స్కోల్జ్‌ గురువారం ప్రకటించారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోని వ్యాక్తులను సూపర్‌ మార్కెట్లు, ఫార్మసీలు, బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, సినిమాహాళ్లతో పాటు పలు ముఖ్యమైన చోట్లలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. అలాగే టీకా తీసుకోని వారు బయట తిరగడాన్ని నిషేధించారు. టీకా తీసుకున్న వారికి మాత్రం మినహాయింపును ఇచ్చారు. ఇదిలా ఉండగా కొవిడ్‌ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విధించిన చర్యలను జర్మన్‌ ఉన్నత న్యాయస్థానం సమర్పించిన నేపథ్యంలో ఆదేశాలు జారీ చేసింది. జర్మనీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

  Telangana Minister: ఓటమి భయంతోనే ఇలా చేశారు.. కేంద్రంపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..


  బుధవారం 24 గంటల్లో 67వేల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదు కాగా.. గురువారం ఒక్కరోజే దాదాపు 70 వేల కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం అవసరం అన్నారు. జర్మనీలో పరిస్థితి తీవ్రంగా ఉందని.. విలేకురుల సమావేశంలో పేర్కొన్నారు. పాఠశాలల్లో మాస్క్‌లను తప్పనిసరి చేయాలని.. ప్రైవేట్ సమావేశాలపై తాజా పరిమితులను విధించాలని సంవత్సరం చివరి నాటికి 30 మిలియన్ల టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.

  Comedian Raghu Karumanchi: మద్యం అమ్ముతున్న కమెడియన్ రఘు.. కారణం ఏంటో తెలుసా..


  వచ్చే వారం ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న ఓలాఫ్ స్కోల్జ్ మాట్లాడుతూ.. తాను సాధారణ టీకా ఆదేశానికి మద్దతు ఇస్తున్నానని.. దీనికి పార్టీలకు అతీతంగా కాకుండా.. ప్రతీ ఒక్కరూ అంగీకరించాలన్నారు. ఇక గత సంవత్సరం ఇదే సమయంలో జర్మనీలో లాక్ డౌన్ ను విధించారు. క్రిస్మస్‌ను దృష్టిలో పెట్టుకుని కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకే జర్మనీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కూడా క్రిస్మస్ కు ఎలాంటి ఆటంకం కలగకుండా.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Germany, Lock down

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు