జర్మనీ ఛాన్సలర్‌‌ ఏంజెలా మెర్కెల్‌కు కరోనా ఎఫెక్ట్.. క్వారంటైన్‌లోకి..

ఏంజెలా మెర్కెల్

కరోనా మరో దేశాధినేతను తాకింది.. ఇప్పటికే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీకి వైరస్‌ సోకడంతో వారిద్దరు ఐసోలేషన్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తాజాగా.. జర్మనీ ఛాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌‌ ఆదివారం నుంచి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

  • Share this:
    కరోనా మరో దేశాధినేతను తాకింది.. ఇప్పటికే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీకి వైరస్‌ సోకడంతో వారిద్దరు ఐసోలేషన్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తాజాగా.. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌‌ ఆదివారం నుంచి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. శుక్రవారం ఆమె న్యూమొకోకస్‌ బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఆ వ్యాక్సిన్‌ ఎక్కించిన వైద్యుడికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆమె క్వారంటైన్‌లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. మెర్కెల్‌కు రోజూ వైద్య పరీక్షలు నిర్వహించనునట్లు ఆమె అధికార బృందం తెలిపింది. ప్రస్తుతానికి ఇంటి దగ్గరి నుంచే విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పటికైతే ఆమెకు ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని, ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు వెల్లడించారు.

    అటు.. జర్మనీలో వైరస్‌ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు గుమికూడడంపై పూర్తిగా నిషేధం విధించారు. ఆ దేశంలో ఇప్పటి వరకు 94 మంది మృతిచెందగా, 24,873 మందికి వైరస్‌ బారిన పడ్డారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: