GENELIA DESHMUKH SAYS SHE WAS DIAGNOSED WITH COVID 19 THREE WEEKS AGO
Genelia Covid News | దేవుడి దయతో కరోనా నుంచి కోలుకున్నా..జెనీలియా వెల్లడి
జెనీలియా (ఫైల్ ఫోటో)
Genelia Covid-19 Report | కోవిడ్-19 టెస్ట్‌కు సంబంధించి సినీ నటి జెనీలియా కీలక ప్రకటన చేసింది. మూడు వారాల క్రితం తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వెల్లడించింది.
కోవిడ్-19 టెస్ట్‌కు సంబంధించి ప్రముఖ సినీ నటి జెనీలియా కీలక ప్రకటన చేసింది. మూడు వారాల క్రితం తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. అయితే 21 రోజుల ఐసొలేషన్ తర్వాత శనివారం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్లు ఇన్‌స్టాగ్రమ్‌లో వెల్లడించింది. గత 21 రోజులుగా తనలో కోవిడ్ లక్షణాలేవీ కనిపించలేదని...దేవుడి దయతో ఇవాళ కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని పేర్కొంది. కోవిడ్‌ను జయించడం ఇంత సులభమని తాను ముందుగా భావించలేదన్న జెనీలియా...అయితే 21 రోజుల ఒంటరి జీవితం తనకు సవాల్‌గా మారిందని అంగీకరిస్తున్నట్లు తెలిపింది. మూడు వారాల విరామం తర్వాత తన కుటుంబ సభ్యుల మధ్యకు రావడం సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొంది. కరోనా మహమ్మారిని జయించాలంటే ముందుగా గుర్తించడం, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం, ఫిట్నెస్తో ఉండటం ఎంతో ముఖ్యమని సూచించింది. రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న జెనీలియాకు...ఇద్దరు కుమారులు రియాన్, రహైల్ ఉన్నారు.
బాలీవుడ్లో పలువురు సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య ఆస్పత్రిలో ఉండి కోలుకున్నారు. అనుపం ఖేత్ తల్లి, సోదరుడు, కోడలుకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. గత వారం తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.