Home /News /coronavirus-latest-news /

GANJAI GANG IN TIRUPATI THEY TARGETED YOUTH AND COLLEGE STUDENTS NGS TPT

Tiruapti: ఆధ్యాత్మిక నగరంలో మత్తుకు బానిసలవుతున్న యూత్.. విద్యార్థులే ఆ గ్యాంగ్ టార్గెట్

ఆధ్యాత్మిక నగరంలో మత్తుకు బానిసలవుతున్న యూత్

ఆధ్యాత్మిక నగరంలో మత్తుకు బానిసలవుతున్న యూత్

ఆధ్యాత్మిక రాజధాని ఇప్పుడు మత్తులో తూగుతోంది. కరోనా నేపథ్యంలో నగరం అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటే.. ఆ మాఫియా మరింత విస్తరిస్తోంది. విద్యార్థులను, యువతను టార్గెట్ గా చేసి రెచ్చిపోతోంది..

  కలియుగ వైకుంఠం.. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు నడయాడే ప్రాంతం.. స్థానికులతో పాటు రాయలసీమలోనే మహా నగరంగా రూపుదిద్దుకుంటున్న ఆధ్యాత్మిక రాజధాని. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం ఇక్కడికి విద్య, వైద్యం కోసం వస్తుంటారు. ఇక దేశ విదేశాల నుంచి హైందవ ఆరాధ్య దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనార్థం ఆ ప్రాంతానికే ముందుకు చేరుకుంటారు. సాధారణ రోజుల్లో నిత్యం లక్షలాది మంది వస్తూ ఉంటారు. తిరుపతి మహా నగరం ఇప్పుడు మత్తు పొగలతో గుప్పు గుప్పు మంటోంది. ఆధ్యాత్మిక తిరునగరి ప్రస్తుతం మత్తులో ఊగుతోంది.. లక్షలాదిగా వచ్చే భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, ప్రైవేట్ బస్టాండ్ దగ్గర ఎప్పుడూ యాత్రికులతో జన జాతరను తలపించేంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్., కర్ఫ్యూ లాంటి నిబంధనలు అమలు చేస్తున్నాయి. మరోవైపు ఏపీలో కరోనా విస్తరణ.. కర్ఫ్యూ కారణంగా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య 15 లోపే ఉంటోంది. కరోనా.. కర్ఫ్యూ నేపథ్యంలో సైలెంట్ గా ఉన్న నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది మత్తు.. అరకు నుంచి తిరుపతి వరకు గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. పవిత్ర పుణ్య క్షేత్రంలో ఎన్నడూ లేని విధంగా మత్తులో ఉగిసలాడుతున్నారు యువకులు. కేవలం విద్యార్థులే టార్గెట్ గా గంజాయి ముఠా చెలరేగి పోతోంది. నెమ్మదిగా వారిని ట్రాప్ లోకి దింపి మత్తుకు బానిసలుగా చేస్తున్నాయి ఆ ముఠాలు..

  ముఖ్యంగా యూనివర్సిటీ, కాలేజీలు, విద్యార్థుల దగ్గర నుంచి ఇంటర్, 9వ తగరగతి చదువుతున్నా విద్యార్థుల హాస్టల్స్ గదులలో భారీగా గంజాయి లభ్యం అవుతున్నాయి. చదువు కోసం ఊరు దాటి మరో ఊరు వచ్చిన యువత.. మత్తు పదార్థాలకు బానిసై
  ధమ్మారే ధమ్.. అంటున్నారు.

  గంజాయికి హాట్ స్పాట్ గా తిరుపతి నగరం మారుతోందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. అరకు నుంచి తిరుపతి వరకు అక్కడి నుంచి కర్ణాకట, తమిళనాడుకి గంజాయి సప్లై అవుతునట్టు తెలుస్తోంది. అరకు నుంచి గంజాయిని విశాఖకు చేర్చి.. అక్కడ నుంచి గుట్టు చప్పుడు కాకుండా రైలు మార్గం గుండా తిరుపతికి తరలిస్తున్నారు. ఉదయం తిరుపతికి చేరుకునే ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ ద్వారా గంజాయిని తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో తనిఖీలు తక్కువగానే ఉంటాయి. దింతో అనుకున్న పని సజావుగా సాగుతాయని ముఠా సభ్యులు పక్క ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. విశాఖ నుంచి తిరుపతికి పార్సెల్ చేరుతుంది. అక్కడ నుంచి నగర శివారు ప్రాంతాలకు గంజాయిని తరలిస్తారు. వచ్చిన రోజే వీటిని కర్ణాకటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వారికీ వచ్చిన ఆర్డర్ లకు పోను మిగిలిన గంజాయి అంత రేణిగుంట, మంగళం, కరకంబాడి స్టాక్ పాయింట్లకు చేరవేస్తారు. ఇక్కడ వచ్చిన స్టాక్ ను చిన్న చిన్న పొట్లాలుగా మర్చి తిరుపతితో పాటుగా చుట్టు పక్కల ప్రాంతాల్లోని దుకాణాలకు చేరవేస్తారు. దుకాణాల నుంచి విద్యార్థులు, యువత, స్థానికులు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ ధర 800 నుంచి 1300 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ తో 8 నుంచి 10 గంజాయి సిగరెట్లను తాయారు చేస్తారు.

  ఇదీ చదవండి: కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ కు ఛాన్స్.. రేసులో టీడీపీ మాజీ నేతలు.. త్వరలో విస్తరణ !

  కాలేజీ స్టూడెంట్ నుంచి.. చిన్న చిన్న వ్యాపారం చేసుకొనే వ్యాపారాలు, ప్రైవేట్ ఉద్యోగులు, బిక్షాటన చేసే యాచకులు కూడా ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తిరుపతి నడిబొడ్డున ఉన్న హరిశ్చంద్ర స్మశాన వాటికలో గంజాయి కొడుతున్న దృశ్యాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన స్వయంగా గుర్తించారు. ఇదే అంశంపై ఎస్పీ వెంకట అప్పలనాయుడుకి పిర్యాదు చేశారు. తిరుపతిలో గంజాయి దందా జోరుగా సాగటానికి యువత, విద్యార్థుల సహకారం అధికంగానే ఉందంటున్నారు పోలీసులు. మొన్నటికి మొన్న తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు ఇంజనీరింగ్ కళాశాలో విద్యాభ్యసం చేస్తున్న ఓ విద్యార్థి గంజాయి పార్సెల్ తీసుకుంటున్న సమయంలో పట్టుబడ్డారు. కొన్ని రోజుల తరువాత విశాఖ నుంచి వచ్చిన ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో నుంచి పార్సెల్ తీసుకుంటూ ఉండగా.. మరికొందరు విద్యార్థులు పోలీసులకు చిక్కారు. దక్షణాది రాష్ట్రాలకు గంజాయి తరలింపు తిరుపతి కేంద్రంగా జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గంజాయి రొంపిలోకి యువతను ఈజీగా నెట్టేస్తున్నారు మాయగాళ్లు. వారిద్వారా గంజాయి దందాను కొనసాగిస్తూన్న ముఠా నాయకులూ మాత్రం బయటకు రావడం లేదు.

  ఇదీ చదవండి:ఏపీలో ఫలితమిస్తున్న కర్ఫ్యూ... వ్యాక్సినేషన్.. తగ్గుతున్న కేసులు

  అయితే మత్తుకు బానిసైన వారి మొక కవళికలు పూర్తిగా మారుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. వాళ్ళ హావభావాలు పసిగట్టాలంటున్నారు. వారి వద్దనుంచి వచ్చే వాసనా ఏంటని గుర్తించాలంటున్నారు. సాధారణ కోపం కన్నా ఎక్కువ వచ్చినా, అనవసరంగా ఆవేశం వచ్చినా అనుమానించాల్సిందే అంటున్నారు. ముఖ్యంగా సమయానికి మత్తు అందకపోతే అధిక ఒత్తిడకి లోనై ఆగ్రహావేశాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రారంభ దశలో గుర్తించి తల్లితండ్రులు కౌన్సిలింగ్ ఇప్పిస్తే ఫలితం ఉంటుంది అంటున్నారు. మత్తుకు బాగా బానిసైన వారిని డీ అడిక్షన్ సెంటర్ కు తరలించి వైద్యం అందించాలి అంటున్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్.

  ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... 28 రోజుల్లోనే సెకెండ్ డోస్

  తిరుపతిలో మత్తు పదార్థాల నియంత్రణపై అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రానా టాటా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపి.. నియంత్రణకు పకడ్బంది చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. మత్తు పదార్థాలపై తిరుపతి అర్బన్ జిల్లాలో పూర్తిగా నిర్మూలన కోసం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేసారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. మత్తు పదార్థాలు అమ్మేవారిపై అలాగే కోనేవారిపై పకడ్బందీగా నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganja, Tirumala, Tirupati

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు