కరోనా పేషెంట్‌పై ఆ పుకార్లను నమ్మొద్దు.. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్

గాంధీ ఆస్పత్రిలో తాజా దృశ్యాలు...

ఆస్పత్రిలో ఉన్న కరోనా పేషెంట్‌.. కామన్ టాయిలెట్‌నే వాడుతున్నాడన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. న్యూస్ 18తో మాట్లాడుతూ ఈ అంశంపై స్పష్టత నిచ్చారు శ్రవణ్ కుమార్.

  • Share this:
    కరోనా వైరస్ బారిన పడిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఏడో అంతస్తులో ఉన్న ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఐతే గాంధీ ఆస్పత్రిలో సదుపాయాలకు సంబంధించిన సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ ఖండించారు. ఆస్పత్రిలో ఉన్న కరోనా పేషెంట్‌.. కామన్ టాయిలెట్‌నే వాడుతున్నాడన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. న్యూస్ 18తో మాట్లాడుతూ ఈ అంశంపై స్పష్టత నిచ్చారు శ్రవణ్ కుమార్.

    కాగా, గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో సరైన వసతులు లేవని ప్రచారం జరిగింది. అతడిని ఉంచిన గదిలో కనీసం వాష్ రూం కూడా లేదని మంగళవారం ఉదయం వార్తలొస్తున్నాయి. కాలకృత్యాలను తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని.. ఈ క్రమంలోనే మిగతా వార్డుల్లో ఉన్న కామన్ టాయిలెట్‌నే అతడు వాడుతున్నాడని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారని వార్తలు వచ్చాయి. ఐతే అందులో నిజం లేదని గాంధీ ఆస్పత్రి వర్గాలు కొట్టిపారేశాయి. పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచిస్తూనే.. తప్పుడు వార్తలను ప్రసారం చేయవద్దని మీడియా హౌజ్‌లకు విజ్ఞప్తి చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: