news18-telugu
Updated: July 9, 2020, 3:15 PM IST
డాక్టర్ విజయలక్ష్మీ, సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై గాంధీ ఆస్పత్రి వైద్యురాలు విజయలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో చేయడం సంచలనంగా మారింది. కేసీఆర్ తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా సమయంలో పాత సచివాలయాన్ని వాడుకోవాల్సింది పోయి కూల్చివేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఓ పక్క కరోనా సాధారణ ప్రజలు చనిపోతుంటే సర్కారు ఇలాగేనా వ్యవహరించేది అంటూ మండిపడ్డారు. ఒకవేళ పాత సచివాలయాన్ని కరోనా పేషెంట్ల కోసం ఉపయోగించుకుంటే... అక్కడ కనీసం పది వేల బెడ్లు పట్టేంత స్థలం ఉందని ఆమె అన్నారు.
నిన్నమొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం... అంత ఖర్చు పెట్టి కొత్త సచివాలయాన్ని ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. అక్కడ వాస్తు బాగోలేకపోతే కేసీఆర్ సీఎం ఎలా అయ్యారని వ్యాఖ్యానించారు. కేంద్రం బృందం వచ్చినప్పుడు గచ్చిబౌలి టిమ్స్‌ను గొప్పగా చూపించారని... కానీ దాన్ని ఉపయోగించడం లేదని అన్నారు. కరోనా వచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు ప్రైవేటు హస్పిటల్స్‌కు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. కరోనా నుంచి
Published by:
Kishore Akkaladevi
First published:
July 9, 2020, 2:35 PM IST