తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు.. పది రోజుల్లోనే 1500 పడకల ఆస్పత్రి..

చైనా కేవలం ఎనిమిది రోజుల్లోనే 1000 పడకల కరోనా ఆస్పత్రిని కట్టింది.. దాన్ని మించేలా 1500 పడకల ఆస్పత్రిని కడుతోంది తెలంగాణ ప్రభుత్వం. అదీ కేవలం పది రోజుల్లోనే.

news18-telugu
Updated: April 9, 2020, 1:17 PM IST
తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు.. పది రోజుల్లోనే 1500 పడకల ఆస్పత్రి..
గచ్చిబౌలి ఆస్పత్రి
  • Share this:
చైనా కేవలం ఎనిమిది రోజుల్లోనే 1000 పడకల కరోనా ఆస్పత్రిని కట్టింది.. దాన్ని మించేలా 1500 పడకల ఆస్పత్రిని కడుతోంది తెలంగాణ ప్రభుత్వం. అదీ కేవలం పది రోజుల్లోనే. దాని కోసం దాదాపు వెయ్యి మంది కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో దేశంలోనే అతి పెద్ద కరోనా ఆస్పత్రిని సిద్ధం చేస్తోంది. కరోనా వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. అందుకు అనుగుణంగా చర్యలను వేగవంతం చేశారు. అందులో భాగంగానే హైదరాబాద్ శివారులో ఉన్న గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఓ కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చేస్తున్నారు. 15 అంతస్తులున్న ఈ భవనంలో ఆస్పత్రికి సంబంధించి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.

ఆస్పత్రిని పరిశీలిస్తున్న మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్


ఫర్నిచర్, మెడికల్ కిట్స్‌ను ఇప్పటికే ఆస్పత్రికి తరలించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో దాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఏప్రిల్ 15 లోగా ఆస్పత్రిని పూర్తి చేసి, కరోనా రోగులందర్నీ ఈ ఆస్పత్రికి తరలించనున్నారు. వైద్యం అందించేందుకు డిప్యూటేషన్ మీద 70 మంది డాక్టర్లను, 120 మంది నర్సులను, పారా మెడికల్ స్టాఫ్‌ను సిద్ధంగా ఉంచారు. ఇటీవలే తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు పరిశీలించారు కూడా.
First published: April 9, 2020, 1:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading