చైనా ఆస్పత్రిని మించేలా.. గచ్చిబౌలి కరోనా ఆస్పత్రి ప్రారంభం నేడే..

Gachibowli Hospital : చైనా కేవలం ఎనిమిది రోజుల్లోనే 1000 పడకల కరోనా ఆస్పత్రిని కట్టింది.. దాన్ని మించేలా 1500 పడకల ఆస్పత్రిని కట్టింది తెలంగాణ ప్రభుత్వం. అదీ 20 రోజుల్లోపే.

news18-telugu
Updated: April 20, 2020, 6:15 AM IST
చైనా ఆస్పత్రిని మించేలా.. గచ్చిబౌలి కరోనా ఆస్పత్రి ప్రారంభం నేడే..
గచ్చిబౌలి ఆస్పత్రి
  • Share this:
Gachibowli Hospital: చైనా కేవలం ఎనిమిది రోజుల్లోనే 1000 పడకల కరోనా ఆస్పత్రిని కట్టింది.. దాన్ని మించేలా 1500 పడకల ఆస్పత్రిని కట్టింది తెలంగాణ ప్రభుత్వం. అదీ 20 రోజుల్లోపే. దాని కోసం దాదాపు వెయ్యి మంది కార్మికులు అహర్నిశలు కష్టపడ్డారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో దేశంలోనే అతి పెద్ద కరోనా ఆస్పత్రిగా రికార్డు సృష్టించిన ఈ హాస్పిటల్ నేడే ప్రారంభం కానుంది. కరోనా వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. అందుకు అనుగుణంగా చర్యలను వేగవంతం చేశారు. అందులో భాగంగానే హైదరాబాద్ శివారులో ఉన్న గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని సిద్ధం చేయించారు. ఇప్పటి వరకు స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఓ కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చేశారు. 15 అంతస్తులున్న ఈ భవనంలో ఆస్పత్రికి సంబంధించి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేశారు.

ఫర్నిచర్, మెడికల్ కిట్స్‌ అన్నీ రెడీగా ఉన్నాయి. ఈ నెల 15 నుంచే ఆస్పత్రిని వాడుకలోకి తీసుకొస్తారని భావించినా, నేడు ప్రారంభించనున్నారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆస్పత్రిని నిర్మించారు. 468 గదుల్లో 50 పడకల ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో అంతస్తులో 36 గదులు ఉండనుండగా, ఒక్కో గదిలో 23 పడకలు ఉండనున్నాయి. కాగా, కరోనా రోగులందర్నీ ఈ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించేందుకు డిప్యూటేషన్ మీద 70 మంది డాక్టర్లను, 120 మంది నర్సులను, పారా మెడికల్ స్టాఫ్‌ను తరలించారు.

ఇదిలా ఉండగా, కరోనా తగ్గాక.. ఈ ఆస్పత్రిని భువనగిరి ఏయిమ్స్ తరహాలో టిమ్స్(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్)ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించారు. అక్కడ ఏయిమ్స్ తరహాలో వైద్య సేవలు అందిస్తారు. అందులో భాగంగానే గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్సు భవనాన్ని ఆరోగ్య శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పటి నుంచి వైద్యారోగ్య శాఖ పరిధిలో ఉండనుంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 20, 2020, 6:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading