Modi in G20 Summit | కరోనాపై జీ20 దేశాల సమరం... WHOకు ప్రధాని మోదీ కీలక సూచనలు

G20 Summit | జీ 20 దేశాల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. WHOకు కీలక సూచనలు చేశారు.

news18-telugu
Updated: March 26, 2020, 9:52 PM IST
Modi in G20 Summit | కరోనాపై జీ20 దేశాల సమరం... WHOకు ప్రధాని మోదీ కీలక సూచనలు
జీ 20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ
  • Share this:
PM Modi in G20 Summit | కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, నిర్మూలన మీద జీ20 దేశాల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు 20 ట్రిలియన్ డాలర్ల సాయం చేయాలని జీ20 భాగస్వామ్య దేశాలు ప్రతినబూనాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థకు పలు సూచనలు చేశారు. WHO సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘ఈ సంక్షోభ (కరోనా వైరస్) సమయంలో వేలాది ప్రాణాలు పోయాయి. సామాజికంగా, ఆర్థికంగా కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తగిలిన గాయం కంటే ఈ మహమ్మారి బయటపెట్టిన ప్రాథమిక వాస్తవిక అంశాలను చెప్పాలనుకుంటున్నా. 2008లో ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి జీ20 ప్రముఖ ఫోరమ్‌గా అవతరించింది. ఆర్థిక స్ధిరత్వాన్ని, వృద్ధిని ప్రోత్సహించింది. ఈ క్రమంలో ప్రపంచీకరణను నిర్వహించడానికి కేవలం ఆర్థిక ఎజెండానే మనం అంతా అనుమతించాం. మానవాళి సమష్టి ప్రయోజనాల కంటే, పరస్పర వ్యక్తిగత ప్రయోజనాల మీదే ప్రధానంగా దృష్టి పెట్టాం. మానవజాతి సమష్టి ప్రయోజనాలను ప్రోత్సహించడంలో బహుపాక్షిక వేదికలు తక్కువ ప్రభావవంతంగా ఉన్నాయి. అది ఉగ్రవాదంపై పోరు కావొచ్చు. వాతావరణ మార్పులు కావొచ్చు. ప్రస్తుతం మనకి మరో ఉదాహరణ కనిపిస్తోంది. ఈ సంక్షోభం ఏకంగా మన అత్యంత అమూల్యమైన వనరులు (ప్రాణాలు, ఆరోగ్యం)ను దోచుకుంటోంది. ప్రపంచ జీడీపీలో 80శాతం జీడీపీ జీ20 దేశాల్లోనే ఉంది. అలాగే, ప్రపంచంలో 60శాతం జనాభా జీ20 దేశాల్లో ఉంది. అలాగే, కోవిడ్ 19 కేసులు కూడా 90 శాతం జీ20 దేశాల్లోనే ఉన్నాయి. 88 శాతం మరణాలు కూడా మన దగ్గరే జరుగుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉండొచ్చు కానీ, మన వ్యవస్థలు పెళుసుగా ఉన్నాయి.’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థలాంటి వాటిని మరింత బలోపేతం చేసి, సంస్కరించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కరోనా వైరస్‌ లాంటి మహమ్మారులను నిరోధించడానికి WHO వద్ద ఎలాంటి ప్రాధమిక నిబంధనలు లేవన్నారు. అందుకే WHOను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్ల తయారీకి ముందస్తు హెచ్చరికలు జారీ చేసేలా వ్యవస్థ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలన్నారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు