కరోనా మృతులకు చివరి మజిలీలో కష్టాలు తీరేనా?

కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడంలో జరుగుతున్న జాప్యంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో మూడు రోజుల్లో ఆ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీనిచ్చారు.

news18-telugu
Updated: July 25, 2020, 1:00 PM IST
కరోనా మృతులకు చివరి మజిలీలో కష్టాలు తీరేనా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమంటూ ‘చచ్చినా.. చావేనా’ అనే పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజూకీ దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో కరోనా వైరస్ సోకి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలను నిర్వహించడం అందరికీ తలనొప్పిగా మారుతోంది. కరోనా సోకి చనిపోతున్న వారు అధిక సంఖ్యలో ఉండడం వల్ల దహన సంస్కారాలు నిర్వహించే స్మశాన వాటికల వద్ద మృతదేహాలు క్యూలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో కరోనా కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం ఆ కుటుంబంలో చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు కావాల్సిన డబ్బు సైతం లేక అల్లాడిపోతున్నారు. కరోనాతో చనిపోయివారి చివరీ మజిలీలోనూ కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి ఘటన ఒకటి బెంగళూరులో చోటుచేసుకుంది.

కర్ణాటకలోని బీబీఎంపీ మున్సిపల్ కార్పొరేషన్‌లో కరోనా సోకి చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఎలక్ట్రానిక్ స్మశాన కేంద్రాలు తక్కువ సంఖ్యలో ఉండడం.. కరోనాతో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అంత్యక్రియల్లో జాప్యం ఏర్పడుతోంది. దీన్ని అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ స్మశాన వాటికల్లో కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు చేయడంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో మున్సిపల్ అధికారులు బెంగళూరులో కరోనా మృతదేహాలను ఖననం చేసేందుకు ప్రత్యేకంగా నాలుగు ఎలక్ట్రానిక్ స్మశాన వాటికలను సిద్దం చేయనుంది.

కెంగేరి(ఆర్ఆర్ సిటీ), మెడి అగ్రహార(యెలహంక), కూడ్లు(బొమ్మనహల్లి), పనత్తూరు(మహాదేవపుర) ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. అంతకుముందు కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడంలో జరుగుతున్న జాప్యంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో మూడు రోజుల్లో ఆ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీనిచ్చారు. కానీ నేటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇదిలావుంటే.. ఇప్పటివరకు మృతదేహాన్ని దహనం చేసేందుకు కుటుంబ సభ్యులు రూ.250 చెల్లించాల్సి ఉంది.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ డబ్బుకు మినహాయింపు ఇవ్వాలని బీబీఎంపీఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ మృతదేహాలను ఇతర స్మశాన వాటికల్లో దహనం చేసేందుకు అనుమతి ఉన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. బెంగళూరులో నిత్యం 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.
Published by: Narsimha Badhini
First published: July 25, 2020, 12:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading