ఇంట్లో రోజు అమ్మ-నాన్న గొడవ.. తొమ్మిదేళ్ల బాలిక షాకింగ్ నిర్ణయం.. చివరకు ఏమైందంటే..

ఇంట్లో రోజు అమ్మ-నాన్న గొడవ.. తొమ్మిదేళ్ల బాలిక షాకింగ్ నిర్ణయం.. చివరకు ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది.

 • Share this:
  కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కరోనా కారణంగా చాలా మంది జాబ్స్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థిక సమస్యలు భార్యభర్తల మధ్య విబేధాలకు దారితీస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇంట్లో తల్లిదండ్రుల రోజు గొడవ పడటం చూడలేకపోయిన ఓ తొమ్మిదేళ్ల చిన్నారి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఇంట్లో నుంచే పారిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్ల కలాంబ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. కరోనా కారణంగా గతేడాది బాలిక తల్లిదండ్రులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే వారిద్దరు మధ్య ఆర్థిక అవసరాలకు సంబంధించి తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

  ఇవి వారి పాపను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి. దీంతో బాలిక తన బట్టలు సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే బాలిక కనిపించకుండా పోవడాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు పలుచోట్ల గాలింపు చేపట్టారు. అయితే బాలిక ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. రెండు రోజుల తర్వాత కలాంబ్ సమీపంలోని ఫ్లైఓవర్ కింద బాలిక జాడను పోలీసులు కనుగొన్నారు.

  Video: ఈ కాకి దొంగ... డబ్బులు ఎత్తుకుపోతుంది.. ఏం చేస్తుందో మీరు ఓ లుక్కేయండి..

  Sputnik V: గుడ్ న్యూస్.. భారత మార్కెట్‌లోకి స్పుత్నిక్-వి వ్యాక్సిన్.. ఎప్పటి నుంచంటే..?

  ఉస్మానాబాద్ ఎస్పీ రాజ్ తిలక్ రౌషన్ మాట్లాడుతూ..తల్లిదండ్రుల గొడవ చూడలేక.. బాలిక బ్యాగ్‌లో బట్టలు ప్యాక్ చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. కోవిడ్-19 నియంత్రణలో భాగంగా విధిస్తున్న లాక్‌డౌన్‌లు, ఆంక్షల వల్ల పిల్లలు బాధితులుగా మారుతున్నారని తెలిపారు. పిల్లల మానస్తత్వంపై కూడా కోవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. పాఠశాలలు లేక, బయటకు వెళ్లే వీలులేక వారు ఇంట్లోనే ఉండాల్సి వస్తోందని.. ఇలా చేయడం ద్వారా వారు కూడా చాలా ఒత్తిడికి లోనవుతుంటారని చెప్పారు. ఈ విషయాన్ని అధికారులు, ఎన్జీవోలు సీరియస్ పరిగణించాలని అభిప్రాయపడ్డారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు