Health : కరోనాకి విరుగుడు... సి విటమిన్ ఉండే ఈ ఆహారం తినాల్సిందే

Coronavirus Food | దేశంలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం ఏదో తెలుసుకొని తినేద్దాం.

news18-telugu
Updated: July 4, 2020, 8:09 PM IST
Health : కరోనాకి విరుగుడు... సి విటమిన్ ఉండే ఈ ఆహారం తినాల్సిందే
Health : కరోనాకి విరుగుడు... సి విటమిన్ ఉండే ఈ ఆహారం తినాల్సిందే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా రోగుల సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్నాయి.  ఈ తరుణంలో  వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రతి ఒక్కరూ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.  పూర్తి ఆరోగ్యంగా, పూర్తి వ్యాధినిరోధక శక్తితో ఉంటే కరోనా వైరస్ కూడా ఏమీ చేయలేదు. కరోనా వైరస్ సోకినా..దాన్ని మనం చాలా ఈజీగా జయించొచ్చు. కరోనా వచ్చిన రోగులకు ఆస్పత్రుల్లో రెగ్యులర్‌గా జలుబు, దగ్గు, జ్వరాలకు ఇచ్చే మందులు ఇస్తూనే... కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నారు. ఫలితంగా వారు కొన్ని రోజుల్లోనే కరోనాను జయించి పూర్తి ఆరోగ్యంతో తమ ఇళ్లకు వెనుదిరుగుతున్నారు. కరోనా రాకున్నా ఈ ఆహార నియమాలు పాటించడం ద్వారా మనం కరోనాను సులభంగా ఎదుర్కోవచ్చు.  మరి ఆ సీక్రెట్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనమూ ఆ ఆహారం తినేద్దాం.

వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలంటే... మన బాడీలో సి విటమిన్ పెంచుకోవాలి. సమస్యేంటంటే... మన బాడీలో C విటమిన్ అనేది స్టాక్ ఉండదు. మనకు కాస్త వేడి చేసిందంటే చాలు అది బాడీలోంచీ లిక్విడ్ రూపంలో బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి... మనం C విటమిన్ రెగ్యులర్‌గా బాడీలోకి వచ్చేలా చేసుకోవాలి. అందుకోసం మనం జంక్ ఫుడ్ తినడం మానేయాలి. అలాగే... ఫ్రూట్సూ, కూరగాయలూ తినాలి. అవేంటంటే...

టమాట, బొప్పాయి, నారింజ, జామకాయి, యాపిల్, కమలం, బత్తాయి, ఉసిరి, నిమ్మకాయ, ద్రాక్ష, కివి, పైనాపిల్, స్ట్రాబెర్రీ, మామిడి, చెర్రీ పండ్లలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి... ఈ పండ్లలో ఏదో ఒకటి రోజూ మీరు తినేలా చేసుకోవాలి. టమాటాలు రోజూ వాడుతుంటాం. కాకపోతే... వాటిని కర్రీలో వండి తింటాం కాబట్టి... ఎక్కువ సి విటమిన్ బాడీకి చేరదు. వాటితోపాటూ... డైరెక్టుగా పండ్లను తింటే... ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఏ పండ్లలో సి విటమిన్ ఉంటుందా అని మనం లోతుగా ఆలోచించాల్సిన పనిలేదు. సింపుల్... పుల్లగా ఉండే పండ్లలో సి విటమిన్ ఉంటుంది.

కూరగాయల్లో బ్రకోలీలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది. అలాగే పచ్చి మిర్చి, పాలకూర, కాలీఫ్లవర్, ఆవాలు, బంగాళాదుంప ఇవి రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకుంటే... బాడీలో సి విటమిన్ సరిపడా లభ్యమవుతుంది. అప్పుడు కరోనా వైరస్ వచ్చినా... ఏమీ కాదు. ఓ వారం బాడీలో ఉండి... ఆ తర్వాత మిగతా జ్వరాలూ, దగ్గుల లాగే అదీ వెళ్లిపోతుంది. కేరళలో డాక్టర్లు ఇదే విషయాన్ని పదే పదే ఆ ముగ్గురు కుర్రాళ్లకూ చెప్పి... వాళ్లలో కాన్ఫిడెన్స్ బాగా పెంచారు. తద్వారా వాళ్లకు ఇప్పుడు వైరస్ బాడీలోంచీ పోయింది. కాబట్టి... మీరు ఏమాత్రం భయపడకుండా... సి విటమిన్ బాడీలో బాగా ఉండేలా చేసుకోండి.

ఐతే... ఒక్క మాట... సి విటమిన్ అనేది మరీ ఎక్కువైతే డేంజరే. సపోజ్... రోజుకో అరబద్ద నిమ్మకాయ రసం మన బాడీకి కావాల్సిన విటమిన్ Cని ఇవ్వగలదు. అలాగని రోజూ నిమ్మకాయే కాకుండా... వేర్వేరు పండ్లను వాడాలి. సి విటమిన్ అనేది ఓ రకమైన యాసిడ్ కాబట్టి... అది మరీ ఎక్కువగా కాకుండా... సరిపడా... తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తీసుకుంటే... పొట్టలో ఎలాంటి సమస్యలూ రాకుండా ఉంటాయి.
Published by: Krishna Kumar N
First published: July 4, 2020, 8:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading