కృష్ణా జిల్లాలో బంపర్ ఆఫర్... మటన్ కొంటే హెల్మెట్ ఫ్రీ...

కృష్ణా జిల్లాలోని నందిగామ పాత బస్టాండ్ లో మటన్ షాపు వ్యాపారి ఈ విన్నూత్న ఐడియాతో ముందుకొచ్చాడు.

news18-telugu
Updated: February 16, 2020, 5:33 PM IST
కృష్ణా జిల్లాలో బంపర్ ఆఫర్... మటన్ కొంటే హెల్మెట్ ఫ్రీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనాలో కరోనా వైరస్ దెబ్బకు ఇండియాలో కూడా జనం వణికిపోతున్నారు. కరోనా వైరస్ భయంతో ప్రజలు చికెన్ తినడాన్ని తగ్గించారు. ఆ ప్రభావంతో చికెన్ రేట్లు తగ్గిపోయాయి. చికెన్ తినడం తగ్గించిన ప్రజలు మటన్ మీద మనసుపడ్డారు. దీంతో మటన్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. చికెన్ తినడానికి మనసొప్పక, మటన్ రేట్లు చూసి నీరసించిపోతున్న వారికి ఓ వినూత్నమైన ఆఫర్ ఇస్తున్నారు కృష్ణా జిల్లా నందిగామలోని మటన్ వ్యాపారులు. ఐదు కేజీల మటన్ కొనుగోలు చేసిన వారికి ఓ హెల్మెట్ ఫ్రీగా ఇస్తున్నారు. ద్విచక్రవాహదారులు హెల్మెట్ వాడకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని తగ్గించేందుకు తమ వంతు సహకారంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

lab grown meat, meat, lab meat, clean meat, fake meat, cultured meat, lab-grown meat, lab, lab meat vegan, synthetic meat, lab grown, test tube meat, ccmb, artificial meat, what is lab grown meat, ల్యాబ్ మీట్, ల్యాబ్ మాంసం, కోడి మాంసం, చికెన్, మేక మాంసం, మటన్, సీసీఎంబీ, హైదరాబాద్,
మటన్ (ప్రతీకాత్మక చిత్రం)


కృష్ణా జిల్లాలోని నందిగామ పాత బస్టాండ్ లో మటన్ షాపు వ్యాపారి ఈ విన్నూత్న ఐడియాతో ముందుకొచ్చాడు. 5 కేజీ ల మటన్ కు హెల్మెట్ ఉచితం అని బోర్డు ఏర్పాటు చేశాడు. తన వద్ద మటన్ 5 కేజీ కోనుగోలు చేసినవారికి రూ.500 విలువ గల హెల్మెట్ ఇస్తున్నాడు. రోడ్డు ప్రమాదాల నివారణ కు హెల్మెట్ వాడాలనే నిబంధనలను పెడచెవిన పెడుతున్న వాహనదారులకు ఈ పద్దతిలోనైనా అవగాహన కల్పించాలి అని ఈ మార్గం ఎంచుకున్నట్టు షాపు యజమాని వెంకటేశ్వరరావు తెలిపారు.First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు