హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

PM Modi: కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా కష్టకాలంలో పేదలకు ఊరట

PM Modi: కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా కష్టకాలంలో పేదలకు ఊరట

ప్రధాని మోదీ ( Image: ANI)

ప్రధాని మోదీ ( Image: ANI)

PM Modi: ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. ఇందుకుగానూ కేంద్రంపై రూ. 26,000 కోట్ల భారం పడనుంది.

కరోనా కల్లోలం సృష్టిస్తున్న ప్రస్తుతం తరుణంలో పేదలకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. గతంలో లాక్‌డౌన్ సమయంలో పేదలు ఇబ్బందిపడకుండా ఉండేందుకు వారికి ఉచితంగా రేషన్ ద్వారా ఆహారధాన్యాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు కూడా అదే రకమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన పథకం కింద.. రాబోయే రెండు నెలల పాటు పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలు అందించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిమే, జూన్ నెలల్లో పేదలు ఉచితంగా ఆహార ధాన్యాలు పొందనున్నారు.

ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. ఇందుకుగానూ కేంద్రంపై రూ. 26,000 కోట్ల భారం పడనుంది. ఈ పథకం కింది పేదలు ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం అందించనున్నారు. గతేడాది నవంబర్ వరకు కేంద్రం ఇదే రకంగా పేదలకు ఈ పథకం ద్వారా ఆహారధాన్యాలు అందించింది.

ఇదిలా ఉంటే దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,32,730 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. నిన్న ఒక్కరోజే కరోనాతో 2,263 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,63,695కి చేరుకుంది. కోలుకున్న వారి సంఖ్య 1,36,48,159 ఉండగా.. యాక్టివ్ కేసులు 24,28,616గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,86,920కు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

First published:

Tags: Food, Pm modi, Ration cards

ఉత్తమ కథలు