Home /News /coronavirus-latest-news /

FOURTH COVID WAVE MAY HIT INDIA IN JUNE 2022 WARNS IIT KANPUR TEAM MKS

4th COVID Wave: దేశంలో కొవిడ్ నాలుగో వేవ్.. ఈ ఏడాది జూన్‌లోనే: IIT Kanpur నిపుణులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాబోయే వేసవిలో మరో విలయం మనకోసం కాచుకుని ఉందంటూ ఐఐటీ కాన్పూర్‌ మరో కరోనా బాంబ్‌ పేల్చింది. జూన్‌లో దేశంలో కోవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ తలెత్తనుందని హెచ్చరించింది.



దేశంలో కరోనా వైరస్ మూడో వేవ్ దాదాపుగా చల్లబడి, కొత్త కేసులు, మరణాలు తగ్గడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, రాబోయే వేసవిలో మరో విలయం మనకోసం కాచుకుని ఉందంటూ ఐఐటీ కాన్పూర్‌ మరో కరోనా బాంబ్‌ పేల్చింది. జూన్‌లో దేశంలో కోవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ తలెత్తనుందని హెచ్చరించింది. కరోనా కేసుల ఉధృతి నాలుగు నెలలపాటు కొనసాగవచ్చని తెలిపింది. వైరస్‌ వేరియంట్‌, టీకా దశల స్థితి వంటి అనేక అంశాలపై నాల్గవ దశ తీవ్రత ఆధారపడి ఉంటుందని వెల్లడించింది.

ఐఐటీ కాన్పూర్ మ్యాథమెటిక్స్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు సబర పర్షద్ రాజేష్‌భాయ్, సుభ్రా శంకర్ ధర్, శలభ్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. జింబాబ్వే కరోనా డేటా ఆధారంగా గాస్సియన్ డిస్ట్రిబ్యూషన్‌ మిశ్రమ సిద్ధాంతం ప్రకారం ఈ స్టడీని నిర్వహించారు. వైరస్‌ కొత్త వేరియంట్లు ఎల్లప్పుడూ తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్న విశ్లేషణ ఆధారంగా ఈ అధ్యయాన్ని చేపట్టారు. ఆ సమాచారాన్ని మెడ్‌రెక్సివ్‌లో ప్రీ-ప్రింట్‌గా ప్రచురించారు. అయితే దీనిపై ఇంకా ముందస్తు సమీక్ష జరుగలేదు.

Vishnu Manchu: మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కే!


కాగా, తమ పరిశీలన ప్రకారం దేశంలో ప్రాథమిక డేటా అందుబాటులోకి వచ్చిన 936 రోజులకు కరోనా ఫోర్త్‌ వేవ్‌ వస్తుందని అధ్యయనకారులు తెలిపారు. ఈ డేటా ఈ ఏడాది జనవరి 22న వెలుగులోకి వచ్చిందని, దీంతో దేశంలో కరోనా నాలుగో దశ జూన్‌ 22 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆగస్ట్‌ 23న పీక్‌ స్టేజ్‌కు చేరుకుంటుందని, అక్టోబర్‌ 24న నాలుగో దశ ముగుస్తుందని అంచనా వేశారు. ఆగస్ట్‌ 15-31 మధ్య కరోనా ఫోర్త్‌ వేవ్‌ తీవ్రత గరిష్ఠంగా ఉంటుందని 99 శాతం మేర విశ్వాసం వ్యక్తం చేశారు.

Published by:Madhu Kota
First published:

Tags: Coronavirus, Covid, India, Omicron

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు