Home /News /coronavirus-latest-news /

FOUR CORONA DEATHS REPORTED FROM ONE FAMILY IN VIJAYAWADA SSR

Vijayawada: విజయవాడ వాళ్లు జాగ్రత్త.. పాతబస్తీ సమ్మెటవారి వీధిలో ఏం జరిగిందో తెలిస్తే..

విజయవాడ

విజయవాడ

తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఏపీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విజయవాడ నగరంలో ఒకే కుటుంబంలో కరోనా సోకిన నలుగురు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఆ వీధిలో నివసిస్తున్న ప్రజలు ఈ ఘటనతో బెంబేలెత్తిపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని పాతబస్తీ సమ్మెటవారి వీధిలో...

ఇంకా చదవండి ...
    విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఏపీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విజయవాడ నగరంలో ఒకే కుటుంబంలో కరోనా సోకిన నలుగురు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఆ వీధిలో నివసిస్తున్న ప్రజలు ఈ ఘటనతో బెంబేలెత్తిపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని పాతబస్తీ సమ్మెటవారి వీధిలో కరోనా ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఆ ప్రాంతానికి చెందిన తూనుగుంట్ల దుర్గాప్రసాద్ కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన కుమారుడు, న్యాయవాది అయిన దినేష్ కూడా కరోనా సోకి మృత్యువుతో పోరాడుతూ మంగళవారం మధ్యాహ్నం తనువు చాలించాడు. మూడు రోజుల క్రితం దినేష్ తల్లి పద్మావతి, దినేష్ బాబాయ్ కూడా కరోనా కారణంగా ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ కుటుంబం కరోనా కాటుకు బలైంది. దినేష్ ఇల్లు, ఆయన బాబాయ్ ఇల్లు పక్కపక్కనే కావడంతో ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు కరోనా కారణంగా చనిపోయారన్న వార్త విజయవాడ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ కుటుంబానికి సంబంధించిన వార్త గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో.. స్థానికులతో పాటు నగరవాసుల్లో టెన్షన్ మొదలైంది. సరిగ్గా ఏడు నెలల క్రితం విజయవాడ నగరంలో కరోనా ఓ న్యాయవాది కుటుంబాన్ని బలి తీసుకుంది. మళ్లీ తాజాగా.. అదే వృత్తిలో కొనసాగుతున్న మరో కుటుంబాన్ని కరోనా పొట్టన పెట్టుకుంది. ఇదిలా ఉంటే.. విజయవాడ నగరంలో మాత్రమే కాదు సమీప పట్టణాల్లో కూడా కరోనా వ్యాప్తి కలవరపాటుకు గురిచేస్తోంది. గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వంటి పట్టణాల్లో కూడా కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇటీవల.. ఇబ్రహీంపట్నం మండలంలో ఇద్దరు పాస్టర్లు, వీటీపీఎస్‌లో ఇద్దరు ఉద్యోగులు కరోనాతో చనిపోయినట్లు సమాచారం. గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఒక వ్యక్తి కరోనాతో చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్టీటీపీఎస్‌లో కరోనా కలకలం రేగింది.

    వారం రోజుల వ్యవధిలో నలుగురు ఉన్నతస్థాయి ఇంజనీర్లు కరోనా బారిన పడి చనిపోయినట్లు తెలుస్తోంది. ఒక కెమిస్ట్ కూడా చనిపోయాడు. ఈ చనిపోయిన వారి వయసు 35 నుంచి 50 సంవత్సరాల లోపు ఉందని తెలుస్తోంది. ఇక.. నున్న ప్రాంతంలో కూడా కరోనా టెన్షన్ నెలకొంది. ఈ ప్రాంతంలో కరోనా కారణంగా వారం రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. దీంతో.. జనం ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడుతున్నారు.

    విజయవాడ రోడ్డులోని రెండు అపార్ట్‌మెంట్‌లలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెంది.. ఇప్పటికే ఆ అపార్ట్‌మెంట్స్‌లోని ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే.. కృష్ణా జిల్లాలో మరీ ముఖ్యంగా విజయవాడ, చుట్టు పక్కల ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి మాస్క్‌లు ధరించి, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Corona, Covid-19, Krishna District, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు