గత డిసెంబర్‌లో చైనాలో పుట్టిన కరోనా వైరస్... ప్రపంచం మొత్తాన్నీ కబళిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడైతే... చైనాలో కంటే ఇతర దేశాల్లో అది భయంకరంగా వ్యాపిస్తోంది. ఆ బాధిత దేశాల్లో ఒకటైన స్పెయిన్‌లో రోజూ కొత్తగా 200 దాకా కేసులు నమోదవుతున్నాయి. ఆల్రెడీ పాజిటివ్ కేసులు 3 లక్షల దాకా ఉన్నాయి. ఏప్రిల్‌లో ఇటలీతోపాటూ... స్పెయిన్‌లో మరణమృదంగం కనిపించింది. ఇప్పటివరకూ 28వేల మందికి పైగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 5 లక్షలు దాటిన వేళ... కరోనా మృతులకు సంఘీభావంగా... కరోనా పేషెంట్లలో ధైర్యం నింపుతూ... స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో... ఆకాశంలో లైటింగ్ షో నిర్వహించారు. ఇందుకోసం... 40 డ్రోన్లను ఉపయోగించడం విశేషం.
ఈ డ్రోన్లకు కలర్‌ఫుల్ లెడ్ లైట్లను అమర్చారు. అందువల్ల డ్రోన్లు గాలిలో ఎగురుతున్నప్పుడు రకరకాల రంగుల్లో లైట్లు వెలిగాయి. అలాగే... హార్ట్ షేప్ సహా... రకరకాల షేప్‌లలో డ్రోన్లు ఎగిరాయి. మృతులకు సంతాపంతోపాటూ... కరోనా వారియర్స్‌కి కూడా ఈ విధంగా ధన్యవాదాలు చెప్పారు.
జూన్ 26 రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి హీరోస్ అండ్ హోప్ అనే పేరు పెట్టారు. డ్రోన్లు ఈ పేరు ఆకాశంలో వచ్చేలా గాల్లో ఎగిరాయి. హార్ట్ సింబల్ అందర్నీ కట్టిపడేసింది. ఇదంతా 10 నిమిషాలపాటూ సాగింది. ఆకాశంలో వస్తున్న వేర్వేరు షేపులను చూసి... ప్రజలు ఎంతో ఆనందించారు. స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జర్మనీ ఫ్లాగ్స్ కూడా చూపించారు. తద్వారా... కరోనాపై పోరాడే ప్రపంచ దేశాలకు సంఘీభావం ప్రకటించారు. ఇదంతా చూసి... చాలా మంది భవిష్యత్తుపై ఆశ పెరిగిందనీ.. నిరాశ నుంచి కోలుకున్నామని చెబుతున్నారు
Drones solidarios iluminan el cielo de Madrid en homenaje a las víctimas de la COVID-19.https://t.co/meByblM6wO pic.twitter.com/fmqRZXWPlG
— Madrid Cultura (@Madrid_Cultura) June 29, 2020
Drones solidarios iluminan el cielo de Madrid en homenaje a las víctimas de la COVID-19.https://t.co/meByblM6wO pic.twitter.com/fmqRZXWPlG
— Madrid Cultura (@Madrid_Cultura) June 29, 2020
మన దేశంలో కూడా కరోనా వచ్చిన కొత్తలో దేశ ప్రజలంతా... కొవ్వొత్తులతో కరోనా వారియర్స్‌కి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత... చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలతో... కరోనా వారియర్స్‌పై పూలవాన కురిపించారు. రాన్రాను దేశంలో కరోనా పెరిగిపోతుండటంతో... ప్రధాని మోదీ... సోషల్ డిస్టాన్స్ తప్పనిసరి కారణంగా... ఇలాంటి కార్యక్రమాలకు తాత్కాలిక బ్రేక్ వేశారు. ఇవాళ్టి జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో ఏదైనా పిలుపు ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Spain