Syed Shahnawaz Hussain: మాజీ కేంద్ర మంత్రి షాన్‌వాజ్ హుస్సేన్ కరోనా పాజిటివ్.. ఎయిమ్స్‌లో చేరిక

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాన్‌వాజ్ హుస్సేన్ కరోనా బారినపడ్డారు.

news18-telugu
Updated: October 22, 2020, 9:11 AM IST
Syed Shahnawaz Hussain: మాజీ కేంద్ర మంత్రి షాన్‌వాజ్ హుస్సేన్ కరోనా పాజిటివ్.. ఎయిమ్స్‌లో చేరిక
సయ్యద్ షాన్‌వాజ్ హుస్సేన్(ఫైల్ ఫొటో)
  • Share this:
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాన్‌వాజ్ హుస్సేన్ కరోనా బారినపడ్డారు. ఆయనకు బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిన విషయాన్ని ఆయన బుధవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. తాను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌లోని ట్రామా సెంటర్‌లో చేరినట్టు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. "ఇటీవల నేను కలిసిన వ్యక్తుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నేను కూడా ఇవాళ టెస్ట్ చేయించుకున్నాను. నాకు ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. గత కొద్ది రోజులుగా నాతో కాంటాక్ట్‌లో ఉన్నా ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తగా టెస్టులు చేయించుకోండి"అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

అయితే రెండు రోజుల క్రితం బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఎన్‌డీఏ అభ్యర్థుల తరఫున ఆయన పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. కొన్ని ర్యాలీల్లో ఆయనతో పాటు బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ కూడా పాల్గొన్నారు. అయితే బీహార్‌ నుంచి ఆయన బీజేపీ సీనియర్ నేతగా ఉన్నారు. అయితే బిహార్ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బీజేపీ అధిష్టానం రెండో జాబితాలో ఆయన పేరు చేర్చారు. ఇక, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్ ఆయన టెక్స్‌టైల్ మంత్రిగా పనిచేశారు.
Published by: Sumanth Kanukula
First published: October 22, 2020, 9:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading