మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి కరోనా పాజిటివ్

మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు

news18-telugu
Updated: October 1, 2020, 2:12 PM IST
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి కరోనా పాజిటివ్
వివేక్ వెంకటస్వామి(ఫైల్ పొటో)
  • Share this:
తెలంగాణ బీజేపీలో కరోనా కలకలం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు నేతలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనను కలిసిన వారు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. "గడిచిన 24 గంటలుగా మైల్డ్‌గా కరోనా లక్షణాలు కనిపించాయి. ఇప్పుడు జరిపిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసినవారు.. క్వారంటైన్‌లో ఉండాలని కోరుతున్నా.. ఒకవేళ లక్షణాలు ఉంటే వారు కూడా టెస్ట్‌లు చేయించుకోండి" అని వివేక్ పేర్కొన్నారు.

ఇక, తన తండ్రి వెంకటస్వామి బాటలోనే రాజకీయాల్లలోకి అడుగుపెట్టిన వివేక్ వెంకటస్వామి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. 2009 నుంచి 2014 మధ్యకాలంలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న వివేక్.. తెలంగాణ సాధనలో తనవంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన వివేక్.. కొంతకాలం పాటు ప్రభుత్వ సలహాదారుగా కొనసాగారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిమాణాల నేపథ్యంలో వివేక్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.


ఇక, తెలంగాణలో తాజాగా 2,214 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,93,600కి చేరింది. నిన్న కరోనాతో 8 మంది మ‌ృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,135కి చేరింది. నిన్న ఒక్కరోజే 2,474 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,63,407కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,058 యాక్టివ్ కేసులుండగా.. అందులో 23,702 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
Published by: Sumanth Kanukula
First published: October 1, 2020, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading