news18-telugu
Updated: October 24, 2020, 3:38 PM IST
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్(File Photo)
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యిందని, ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా తాను పనిచేస్తున్నానని...తనకు కాస్త విశ్రాంతి ఇవ్వాలన్నది దేవుడి నిర్ణయం కాబోలని పేర్కొన్నారు. కోవిడ్-19 నిర్ధారణ కావడంతో ఐసోలేషన్‌లో ఉంటూ...డాక్టర్ల సూచన మేరకు అవసరమైన మెడిసిన్స్ తీసుకుంటున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. తనను కలిసిన వ్యక్తులు..కరోనా పరీక్షలు చేయించాలని ఆయన సూచించారు.
దేవేంద్ర ఫడ్నవిస్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 50 ఏళ్ల ఫడ్నవిస్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గత కొన్ని వారాలుగా బీజేపీ తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ నియోజకవర్గ పార్టీ నేతలతోనూ విస్తృత సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా సోకడంతో ఆయన ఐసొలేషన్‌లో ఉంటూ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహాలను పర్యవేక్షించనున్నారు.
పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు త్వరగా ఫడ్నవిస్ కోవిడ్ నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు.
Published by:
Janardhan V
First published:
October 24, 2020, 3:38 PM IST