COVAXIN తయరీలో పురోగతిని పరిశీలించిన విదేశీ బృందం.. తమ వ్యాక్సిన్ అత్యంత సేఫ్ అని వివరించిన భారత్ బయోటెక్

ప్రతీకాత్మక చిత్రం

వివిధ దేశాలకు చెందిన 70 మంది అంబాసిడర్లు, హై కమిషనర్ల బృందం ఈ రోజు భారత్ బయోటెక్ ను సందర్శించింది. వారు భారత్ బయోటెక్ బృందంతో సమావేశమై ‘COVAXIN’ గురించి చర్చించారు. వ్యాక్సిన్ తయారీలో పురోగతిపై భారత్ బయోటెక్ మేనేజింగ్ డెరెక్టర్ డాక్టర్ కృష్ణా ఎల్లా విదేశీ ప్రతినిధుల బృందానికి వివరించారు.

  • Share this:
    ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారిని చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ముందు వరుసలో నిలిచింది. దీంతో ప్రపంచ దేశాల చూపు ఈ కంపెనీపై ఉంది. ఇటీవల మన ప్రధాని మోదీ సైతం భారత్ బయోటెక్ ను స్వయంగా సందర్శించి వ్యాక్సిన్ తయారీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా వివిధ దేశాలకు చెందిన 70 మంది అంబాసిడర్లు, హై కమిషనర్ల బృందం ఈ రోజు భారత్ బయోటెక్ ను సందర్శించింది. వారు భారత్ బయోటెక్ బృందంతో సమావేశమై ‘COVAXIN’ గురించి చర్చించారు. వ్యాక్సిన్ తయారీలో పురోగతిపై భారత్ బయోటెక్ మేనేజింగ్ డెరెక్టర్ డాక్టర్ కృష్ణా ఎల్లా విదేశీ ప్రతినిధుల బృందానికి వివరించారు. ‘COVAXIN’ అత్యంత సురక్షిమైన టీకా అని వారు తెలిపారు. భారత్ బయోటెక్ ఈ టీకాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR)-నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఈ టీకాను తయారు చేస్తున్నట్లు తెలిపారు. 300 మిలియన్ల డోస్ లతో అత్యంత సురక్షితమైన రికార్డును ఇది సొంతం చేసుకుందన్నారు.

    కోవాక్సిన్ ఫేస్ 3 ట్రయల్స్ నవంబర్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 26000 మంది వాలంటీర్లు ఈ ట్రయల్స్ లో పాల్గొన్నారు. భారత దేశంలో ఫేస్ 3 ట్రయల్స్ కు వెళ్లిన వ్యాక్సిన్ ఇదొక్కటే వ్యాక్సిన్ విశేషం. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ.. కోవాక్సిన్ తయారీ, క్లీనికల్ ఎవాల్యుయేషన్ భారత దేశ నావెల్ వాక్సినాలజీలో ఓ మైలు రాయి అని అభివర్ణించారు. ప్రపంచదేశంలోని అనేక దేశాలు తమ వ్యాక్సిన్ పై ఆసక్తి చూపుతున్నాయని వివరించారు. వివిధ దేశాల ప్రతినిధులు రావడం తమకు గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా ప్రపంచ దేశాలు కరోనాపై పోరాటంలో భారత్ వైపు చూస్తున్న విషయాన్ని తమకు గుర్తు చేస్తుందన్నారు.

    ఇదిలా ఉంటే.. అమెరికా కంపెనీ ఫైజర్ (Pfizer) నుంచి తొలి అధికారిక కరోనా వ్యాక్సిన్ వచ్చేయడంతో... మరి ఆక్స్‌ఫర్డ్, ఆస్త్రాజెనెకా కంపెనీ కలిసి తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ (Covishield) ఎప్పుడొస్తుంది... ఎలా పనిచేస్తుంది... అన్నదానిపై ప్రపంచ దేశాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇండియాలో ఈ వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేయనుందన్న విషయం మనకు తెలుసు. ఈ వ్యాక్సిన్ ధరను రూ.250గా చెబుతున్నారు. భారతీయులు ఎక్కువగా ఉపయోగంచబోయేది ఈ వ్యాక్సినే అంటున్నారు.

    అందువల్ల ఇది కరోనాపై బాగా పనిచేస్తుందా లేదా అన్నది మనకు కీలకమైన అంశం. కొద్ది మందిపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూసినప్పుడు ఇది 90 శాతం సమర్థంగా పనిచేసింది. వాళ్లంతా సగం డోస్ తీసుకున్నారు. ఐతే... పెద్ద మొత్తంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మాత్రం 62 శాతం సమర్థంగా పనిచేసినట్లు లాన్సెట్ (Lancet) జర్నల్‌లో పబ్లిష్ చేసిన ట్రయల్ డేటా చెబుతోంది. ఐతే... ఫైజర్ వ్యాక్సిన్ ఏకంగా 95 శాతం సమర్థంగా పనిచేస్తోందని ప్రచారం జరిగింది.
    Published by:Nikhil Kumar S
    First published: