SMSతో కరోనా దూరం.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రచారం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దఫా వస్తుందనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర సర్కారు కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. అయితే, ఇక్కడ SMS అంటే మనం మొబైల్స్‌లో చేసే SMS కాదు.

news18-telugu
Updated: November 24, 2020, 7:41 AM IST
SMSతో కరోనా దూరం.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
SMS పాటించండి. కరోనాకు దూరంగా ఉండండి. ఇదే ఏపీ ప్రభుత్వం సరికొద్ద నినాదం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దఫా వస్తుందనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర సర్కారు కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. అయితే, ఇక్కడ SMS అంటే మనం మొబైల్స్‌లో చేసే SMS కాదు. ఇక్కడ S అంటే సబ్బు లేదా శానిటైజర్, M అంటే మాస్క్, S అంటే సోషల్ డిస్టెన్స్ అంటే ఎప్పుడూ శానిటైజర్ వాడుతూ ఉండాలి. మాస్క్ ధరించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నమాట. కరోనా రెండో దఫా ముప్పు ముంచుకొస్తోందని, ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దంటూ ఏపీ కోవిడ్ 19 కంట్రోల్ రూమ్ ఓ సందేశాన్ని ప్రజలకు పంపింది.

కోవిడ్ 19 కంట్రోల్ రూమ్ సందేశం

ప్రస్తుతానికి కరోనా వైరస్ కు పూర్తిస్థాయిలో మందులు లేవు. వ్యాక్సిన్లు కూడా ఇప్పటికిప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బయటకు వెళ్లినపుడు తప్పనిసరిగా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంతోపాటు వెంట శానిటైజర్ ను కూడా తీసుకుని వెళ్లాలి. అవకాశం ఉంటే తరచూ సబ్బు, నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం మన పాటించాల్సిన ముఖ్యమైన విధానం ఎస్.ఎం.ఎస్ ( సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్). కోవిడ్-19 ను ఎదుర్కొనడానికి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఆయుధాల్లో ఈ ఎస్.ఎం.ఎస్ విధానం అతి ముఖ్యమైనది.

సబ్బు లేదా శానిటైజర్
మనం పనిచేసుకుంటున్న ప్రదేశంలోగానీ, ఇంట్లో గానీ, బయట కూరగాయలకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు ఇలా అనేక సార్లు మనం చేతులతో ఎన్నో వస్తువులను తాకుతూ ఉంటాం. అవే వస్తువులను మనకు తెలియకుండా ఎంతోమంది తాకి ఉంటారు. అందువల్ల కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంటికి రాగానే సబ్బు అయితే కనీసం 20 సెకన్ల నుంచి 40 సెకన్లపాటు మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వంట వండే ముందూ, వండిన తర్వాత, ఆహారం తీసుకునేటప్పుడు, తీసుకున్న తర్వాత, మాంసం, చేపలూ మొదలయిన నాన్ వెజ్ పదార్థాలు శుభ్రం చేసేటప్పుడు, పిల్లలకు ఆహారం పెట్టే ముందు ఇలా ప్రతిసారి సబ్బుతోనూ, నీళ్లతోనూ చేతులు శుభ్ర పరుచుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్లినట్టయితే తప్పనిసరిగా శానిటైజర్ దగ్గర ఉంచుకోవడం అవసరం.

మాస్కు ధరించడం
కోవిడ్ 19ను మన నుంచి ఇతరులకు, ఇతరుల నుంచి మనకు వ్యాప్తి చెందకుండా ఉంచే మార్గాల్లో మాస్కు ధరించడం కీలకమైనది. ప్రతిఒక్కరూ మాస్కు పెట్టుకోవడం ద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి. మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్లు కూడా విధిస్తున్నారు. అందుకే ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్ కానీ, ఇంట్లో తయారు చేసిన మాస్క్ కానీ తప్పనిసరిగా ధరించాలి. మాస్కును ప్రతిరోజూ మారుస్తూ ఉండాలి. మాస్కును ఉతికిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి.

భౌతిక దూరం
కోవిడ్ ను ఎదుర్కొనేందుకు మన దగ్గరున్న మరో ఆయుధం భౌతిక దూరం. ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి కనీసం ఆరు అడుగులు లేదా 2 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కూరగాయల మార్కెట్‌లోను, కిరాణా షాపులకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు, ఆఫీసులో పనిచేసే సమయంలో, ప్రయాణ సమయంలో, ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 24, 2020, 7:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading