హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఇంటింటి సర్వే, ర్యాపిడ్ టెస్ట్‌లు చేయండి.. తెలంగాణ సహా 10 రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఇంటింటి సర్వే, ర్యాపిడ్ టెస్ట్‌లు చేయండి.. తెలంగాణ సహా 10 రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆయా మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇంటింటి సర్వేలతో పాటు ర్యాపిడ్ టెస్టులు చేయాలని సంబంధిత అధికారులను కేంద్రం ఆదేశించింది. మరణాల రేటును తగ్గించేందుకు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు వంటి హైరిస్క్‌లో ఉన్న వారికి కరోనా టెస్టులు చేయాలని సూచించింది.

ఇంకా చదవండి ...

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు సుమారు 10వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 45 నగరాలపై ప్రత్యేక దృష్టిపెట్టి.. అక్కడ ఇంటింటి సర్వే, ర్యాపిడ్ టెస్టులు చేయాలని ఆదేశించింది. సోమవారం కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖ సెక్రటరీ ప్రీతి, ఇతర ఉన్నాతాధికారులతో కలిసి కరోనాపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

10 రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం గుర్తించింది. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్నాటక, ఉత్తాఖండ్, మధ్యప్రదేశ్‌లోని 45 మున్సిపల్ కార్పొరేషన్లలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇంటింటి సర్వేలతో పాటు ర్యాపిడ్ టెస్టులు చేయాలని సంబంధిత అధికారులను కేంద్రం ఆదేశించింది. మరణాల రేటును తగ్గించేందుకు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు వంటి హైరిస్క్‌లో ఉన్న వారికి కరోనా టెస్టులు చేయాలని సూచించింది. కరోనా కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

First published:

Tags: Corona, Coronavirus, Covid, Covid-19, Lockdown relaxations

ఉత్తమ కథలు