కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగో దఫా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఇప్పటికే మూడు దఫాలుగా ప్యాకేజీని ప్రకటించారు. తొలి రోజు ఎంస్ఎంఈలకు, రెండో రోజు చిన్న, సన్నకారు రైతులకు, రేషన్ కార్డుదారులకు, ఇతరత్రా వివరాలతో ప్యాకేజీ ప్రకటించారు. మూడో రోజు వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ప్యాకేజీ ప్రకటించారు. అలాగే, వ్యవసాయ రంగంలో సంస్కరణలను కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు నాలుగో రోజు మరో ప్యాకేజీని ప్రకటిస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.