కేంద్రం భారీ ప్రకటన... కరోనాతో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులకు...

కరోనా వైరస్ మీద పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.50లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించింది.

news18-telugu
Updated: March 26, 2020, 2:41 PM IST
కేంద్రం భారీ ప్రకటన... కరోనాతో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులకు...
ప్రధాని మోదీ
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు డాక్టర్లు, నర్సులు, శానిటైజేషన్ వర్కర్లు, ఇతరత్రా వైద్య సిబ్బంది భారీ ఎత్తున పోరాడుతున్నారు. కంటికి కనిపించని వైరస్‌తో బయటకు కనిపించని యుద్ధం చేస్తున్నారు. ఈ పోరాటంలో తమకేమైనా జరిగితే తమ కుటుంబాలు ఏమైపోతాయన్న భయాన్ని, ఆందోళనను కూడా పక్కన పెట్టి పోరాటం చేస్తున్నారు. అలా పోరాడుతున్న వారికి మనోథైర్యం కలిగించేందుకు కేంద్రం భారీ ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మీద పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఇతరత్రా వైద్య సేవల్లో నిమగ్నమై ఉన్న సుమారు 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించింది. కరోనా మీద పోరాడుతున్న యోధులకు మనోధైర్యం కల్పించేందుకు ఈ రకంగా అడుగులు ముందుకు వేసింది.

కరోనా వైరస్ వల్ల దెబ్బతిన్న రంగాలు, ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్షా 70వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అందులో మొదటగా వైద్యుల ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఈనెల 22న జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా మీద పోరాడుతున్న వైద్యులకు మద్దతుగా నిలవాలని సూచించారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలు అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టి అభినందించాలని సూచించారు. అలాగే, ప్రజలు అందరూ చప్పట్లు కొట్టి వైద్యసేవలు అందిస్తున్న వారికి అభినందించారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు