కార్పొరేటీకరణ, ఎఫ్‌డీఐల పెంపు... రక్షణ రంగంలో నిర్మలా సీతారామన్ సంస్కరణలు

Nirmala Sitharaman Speech Live | ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులను కార్పొరేటీకరణ చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

news18-telugu
Updated: May 16, 2020, 5:19 PM IST
కార్పొరేటీకరణ, ఎఫ్‌డీఐల పెంపు... రక్షణ రంగంలో నిర్మలా సీతారామన్ సంస్కరణలు
నిర్మలా సీతారామన్
  • Share this:
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సంస్కరణల మీద దృష్టిపెట్టారు. ఈరోజు 8 రంగాల్లో నిర్మాణాత్మక సంస్కరణలను ప్రతిపాదించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంస్కరణలు తీసుకురావడంలో ఎప్పుడూ ముందు ఉంటారని నిర్మలా సీతారామన్ చెప్పారు. మేకిన్ ఇండియా, జీఎస్టీ, జన్ ధన్, యూపీఐ లాంటి అంశాలను ఆమె ప్రస్తావించారు. ఈరోజు ఎనిమిది రంగాల్లో సంస్కరణలను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.

1. కమర్షియల్‌గా బొగ్గు ఉత్పత్తి

2. ఖనిజాలు
3. రక్షణ ఆయుధాలు సొంత తయారీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల బోర్డు కార్పొరేటీకరణ
4. ఎయిర్ స్పేస్, ఎయిర్ పోర్టులు, ఎంఆర్ఓ
5.  కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ
6. అంతరిక్ష రంగం7. అంతరిక్ష రంగం
8. అటామిక్ ఎనర్జీ

కమర్షియల్ మైనింగ్...
బొగ్గు ఉత్పత్తి రంగంలో కమర్షియల్ మైనింగ్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తిలో ప్రభుత్వం ఆధిపత్యం ఉంది. దీన్ని మార్చి కమర్షియల్ మైనింగ్ కోసం ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు ఇస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ బొగ్గు గనులు ఉన్న మూడో దేశంగా భారత్ ఉన్నప్పటికీ ఇండియా ఇంకా బొగ్గును దిగుమతి చేసుకుంటోందన్నారు. బొగ్గు నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసే వారికి ఇన్సెంటివ్‌లు కూడా ఇస్తారు. ఉత్పత్తి చేసిన బొగ్గును వినియోగించుకునేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.50,000 కోట్లు కేటాయింపు.

ఖనిజాల ఉత్పత్తిలో సంస్కరణలు...
ఖనిజాల ఉత్పత్తిలో సంస్కరణలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. 500 మైనింగ్ బ్లాక్‌ల నుంచి ఉత్పత్తికి అనుమతులు ఇస్తారు. బాక్సైట్, అల్యూమినియం లాంటి వాటికి స్థానికంగా జాయింట్ ఆక్షన్ నిర్వహిస్తారు.

రక్షణ రంగంలో సంస్కరణలు
రక్షణ రంగంలో పలు సంస్కరణలను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. రక్షణ రంగానికి అవసరమైన వాటిని కూడా భారత్‌లోనే తయారు చేసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటి వరకు దిగుమతి చేసుకుంటున్న వాటిని మెల్లమెల్లగా తగ్గిస్తామన్నారు. ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకునే వాటి సంఖ్యను తగ్గిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల దిగుమతి చేసుకునేందుకు అయ్యే ఖర్చు భారీగా తగ్గుతుందని చెప్పారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులను కార్పొరేటీకరణ చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కార్పొరేటీకరణ అంటే ప్రైవేటీకరణ కాదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కార్పొరేటీకరణ అంటే దాన్ని బెస్ట్‌ మేనేజింగ్ వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేస్తామని చెప్పారు. దాని ద్వారా ప్రజలు స్టాక్స్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఇక రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలను 49 శాతం నుంచి 75 శాతానికి పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
First published: May 16, 2020, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading