Home /News /coronavirus-latest-news /

FM NIRMALA SITHARAMAN ANNOUNCE NEW ACT FOR FARMERS AND AMENDMENTS FOR ESSENTIAL COMMODITIES ACT BA

రైతుల కోసం కొత్త చట్టం... ప్రకటించిన నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి

నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి

రైతుల కోసం కొత్తగా చట్టం తీసుకుని వస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

    దేశంలో మద్దతు ధర కోసం రైతులు పడే కష్టం అంతా ఇంతా కాదు. కష్టపడి పండించిన పంటకు కోరినంత కాదు. కనీసం మద్దతు ధర అయినా దక్కితే చాలని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఏదైనా ప్రొడక్ట్ తయారు చేసిన వారు తమకు నచ్చిన ధరకు విక్రయిస్తారు. రైతులకు మాత్రం అలాంటి వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో రైతుల కోసం కేంద్రం కొత్తగా ఓ చట్టం తీసుకురానుంది. రైతులు తాము పండించిన పంటను ఏ రాష్ట్రంలో అయినా అమ్ముకోవచ్చు. ప్రస్తుతం ఆ వెసులుబాటు లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పొరుగు రాష్ట్రంలో ఎక్కువ ధర లభిస్తుందంటే అక్కడకు తీసుకుని వెళ్లి విక్రయించవచ్చు. అలాగే, ఈ- ట్రేడింగ్ ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మూడు సంస్కరణలను ప్రకటించారు.

    ప్రతి సీజన్‌‌కు ముందు విత్తనాలు నాటే ముందే రైతులకు ఈ సంవత్సరం ఏ పంట ఎంత అవసరం అవుతుంది? దానికి మద్దతు ధర ఎంత ఉంటుంది? ఎంత ఉత్పత్తి సరిపోతుందనే వివరాలను తెలియజేస్తారు. అది కూడా లీగల్‌గా.

    నిత్యావసర సరుకుల చట్టం 1955లో సవరణలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొన్ని రకాలైన ఆయిల్స్‌ను నిత్యావసరాల జాబితా నుంచి తొలిగించారు. హోల్ సేల్ వ్యాపారులు, ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల వారి వద్ద ఎక్కువ మొత్తంలో ఆయిల్స్ నిల్వ ఉన్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన జాబితాలోని వస్తువులకు ఎలాంటి స్టాక్ లిమిట్స్ ఉండవు. అత్యవసర సమయంలో మాత్రమే షరతులు వారికి వర్తిస్తాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Coronavirus, Covid-19, Farmers, Lockdown, Nirmala sitharaman

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు