Coronavirus Effect: ఆన్‌లైన్ షాపింగ్ బంద్... మీ ఆర్డర్స్ ఏమయ్యాయంటే

Coronavirus Lockdown Effect | కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో ఆ ప్రభావం ఆన్‌లైన్ షాపింగ్‌పైనా పడింది. ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ దిగ్గజ కంపెనీలు ఆన్‌లైన్ షాపింగ్‌ను నిలిపివేశాయి.

news18-telugu
Updated: March 25, 2020, 1:36 PM IST
Coronavirus Effect: ఆన్‌లైన్ షాపింగ్ బంద్... మీ ఆర్డర్స్ ఏమయ్యాయంటే
Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ బంద్... మీ ఆర్డర్స్ ఏమయ్యాయంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఏమైనా ఆర్డర్ చేశారా? అమెజాన్‌లో ఏదైనా బుక్ చేశారా? మీ ప్రొడక్ట్ కోసం ఎదురుచూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ లాంటి ఇ-కామర్స్ సంస్థలు ఆన్‌లైన్ షాపింగ్ నిలిపివేషాయి. మీరు ఇప్పుడు ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో షాపింగ్ చేయాలంటే సాధ్యం కాదు. అంతేకాదు... మీరు గతంలో ఆర్డర్ చేసిన వస్తువులు డెలివరీ అవుతాయో లేదో ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ చాలావరకు డిస్పాచ్ అయి ఉంటాయి. అవి మీకు సమీపంలో ఉన్న డెలివరీ హబ్స్‌కి వచ్చేసి ఉంటాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో ప్రజలంతా ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ఇ-కామర్స్ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, డెలివరీ బాయ్స్‌ది ఇదే పరిస్థితి. అయితే వీటిని ఎలా డెలివరీ చేయాలన్న డైలమాలో ఉన్నాయి ఇ-కామర్స్ కంపెనీలు.

దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఇ-కామర్స్ కంపెనీలు కొత్త ఆర్డర్స్ తీసుకోవట్లేదు. ఈ జాబితాలో ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్, లాంటి సంస్థలున్నాయి. అయితే అమెజాన్ మాత్రం నిత్యావసర వస్తువుల్ని మాత్రమే లిస్టింగ్‌లో ఉంచాయి. వాటి ఆర్డర్లు మాత్రమే తీసుకుంటున్నాయి. వాటిని ఆర్డర్ చేసినా మీకు డెలివరీ అయ్యే అవకాశాలు ఎంత అన్నది తెలియదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్ అంటే అత్యవసర సర్వీసులు తప్ప మిగతా అన్నీ కార్యకలాపాలు బంద్ అయినట్టే. అది ఇ-కామర్స్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. మరి ఈ కంపెనీలకు ఏవైనా మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందేమో చూడాలి. ఒకవేళ కంపెనీలు ఆర్డర్లు తీసుకున్నా అవి కస్టమర్లకు చేర్చేందుకు డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్ కావాలి. మరి లాక్‌డౌన్ కొనసాగుతుండగా వారిని బయట తిరగడానికి అనుమతి ఇస్తారా అన్నది అనుమానమే.

కొన్ని రోజులుగా కరోనా భయాలు ఉండటంతో అనేక మంది ఎక్కువగా ఆర్డర్లు చేశారని, లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు నుంచి కొన్ని గంటల వరకు ఈ ఆర్డర్ల సంఖ్య పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఇ-కామర్స్ వెబ్‌సైట్లతో పాటు డెలివరీ పార్ట్‌నర్స్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ అన్నీ వేర్‌హోజ్‌లు, డెలివరీ సెంటర్లలో ఉండిపోయాయి. కాబట్టి వాటి కోసం కస్టమర్లు ఎదురుచూడటం తప్ప వేరే మార్గం లేదు.

ఇవి కూడా చదవండి:



సినిమాలు చూడాలా? అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 ఫ్రీగా పొందండి ఇలా

SBI: ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేయాలా? ఈ ఫీచర్ ట్రై చేయండి

IRCTC: రైలు టికెట్ల క్యాన్సలేషన్‌పై డౌట్స్... క్లారిటీ ఇచ్చిన ఐఆర్‌సీటీసీ
First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading