COVID-19 Insurance: ఫ్లిప్‌కార్ట్‌లో కరోనావైరస్ ఇన్స్యూరెన్స్... రూ.159 మాత్రమే

Flipkart Coronavirus Insurance Plan | మీరు కరోనా వైరస్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌ రెండు పాలసీలను ప్రకటించింది.

news18-telugu
Updated: April 14, 2020, 3:40 PM IST
COVID-19 Insurance: ఫ్లిప్‌కార్ట్‌లో కరోనావైరస్ ఇన్స్యూరెన్స్... రూ.159 మాత్రమే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. భారతదేశంలో లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగించింది ప్రభుత్వం. కరోనా వైరస్ ప్రభావంతో ఆరోగ్యంపై స్పృహ, అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు తీసుకోవాలన్న ఆలోచన కూడా పెరుగుతోంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉండటంతో ఈ వ్యాధి కవర్ అయ్యేలా కంపెనీలు ప్రత్యేకంగా ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఇన్స్యూరెన్స్ ప్రొవైడర్స్ అయిన డిజిట్, ఐసీఐసీఐ లాంబార్డ్‌ల భాగస్వామ్యంతో రెండు మెడికల్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ తీసుకున్నవారు కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిపాలైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే పాలసీకి 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు పాలసీ తీసుకున్న 15 రోజుల తర్వాత కవరేజీ ప్రారంభమవుతుంది.

ఐసీఐసీఐ లాంబార్డ్ కరోనా వైరస్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ రూ.159 నుంచి ప్రారంభమవుతుంది. రూ.159 ప్లాన్ తీసుకున్నవారికి రూ.25,000 కవరేజీ లభిస్తుంది. 18 నుంచి 75 ఏళ్ల వయస్సు వాళ్లు ఈ పాలసీ తీసుకోవచ్చు. డాక్టర్లతో ఉచితంగా 4 టెలిఫోనిక్ కన్సట్లేషన్స్ అందిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ అసిస్టెన్స్ ఉంటుంది. 2019 డిసెంబర్ 31 తర్వాత విదేశాల్లో ప్రయాణించినవారికి ఈ పాలసీ ఇవ్వరు.

డిజిట్ ఇల్‌నెస్ గ్రూప్ ఇన్స్యూరెన్స్‌లో 30 రోజుల ప్రీ హాస్పిటలైజేషన్, 60 రోజుల పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజీ కవర్ అవుతుంది. 18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. రూ.1 లక్ష వరకు కవరేజీ ఉంటుంది. రూమ్, ఐసీయూ ఛార్జీలపై ఎలాంటి పరిమితి లేదు. 1 శాతం అంబులెన్స్ ఛార్జీలు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే గత 30 రోజులుగా విదేశాల్లో ప్రయాణించలేదని ఆధారాలు చూపించాలి. డయాబెటిస్, హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ పాలసీ ఇవ్వరు. రూ.1,00,000 కవరేజీతో పాలసీ తీసుకోవాలంటే రూ.511 చెల్లించాలి.

ఇవి కూడా చదవండి:

SBI: ఆ ఎస్ఎంఎస్ వస్తే డిలిట్ చేయండి... ఖాతాదారులకు ఎస్‌బీఐ అలర్ట్

IRCTC: రైలు టికెట్లపై ఫుల్ రీఫండ్ వస్తుందా? క్లారిటీ ఇచ్చిన ఐఆర్‌సీటీసీ

EMI Moratorium: మారటోరియం విషయంలో ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ ఖాళీ
First published: April 14, 2020, 3:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading