Home /News /coronavirus-latest-news /

FIX REASONABLE AMBULANCE CHARGE FOR COVID PATIENTS TOP COURT TO STATES BA

కరోనా పేషెంట్లకు ఆంబులెన్స్ చార్జీలపై సుప్రీం కీలక ఆదేశాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కొన్ని రోజుల క్రితం కోల్ కతాలో కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తరలించడానికి ఆంబులెన్స్ డ్రైవర్ రూ.9000 చార్జీ అవుతుందని చెప్పాడు.

    కరోనా పేషెంట్లను తరలించేందుకు ఆంబులెన్స్‌లు భారీగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. కేవలం కిలోమీటర్ దూరానికి కూడా వేల రూపాయలు చార్జీలు వసూలు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కోల్ కతాలో కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తరలించడానికి ఆంబులెన్స్ డ్రైవర్ రూ.9000 చార్జీ అవుతుందని చెప్పాడు. ఇదో పెద్ద దుమారం రేగింది. చివరకు డాక్టర్లు జోక్యం చేసుకుని రూ.2000 వేలకు సెటిల్ చేశారు. అయినా కేవలం 8 కిలోమీటర్ల దూరానికి రూ.2000 కూడా ఎక్కువే. ఈ క్రమంలో ఆంబులెన్స్ చార్జీలను ప్రభుత్వం నియంత్రించేలా చూడాలంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కరోనా పేషెంట్లను తరిలించే ఆంబులెన్స్‌లకు ఆమోదయోగ్యమైన చార్జీలను ఫిక్స్ చేయాలంటూ రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే, జిల్లాల్లోని ఆస్పత్రుల్లో సరిపడినన్ని ఆంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘కరోనా మహమ్మారికి సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రాలు తప్పకుండా పాటించాలి.’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే, గతంలో కరోనా టెస్టుల ధరలకు కూడా నియంత్రించాలని కేంద్రం చెప్పింది. అయితే, కరోనా పేషెంట్లకు అందించే చికిత్సకు ఎంత ధరలు వసూలు చేయొచ్చన్న దానిపై మాత్రం ఎలాంటి పరిమితులు లేవు.

    భారత్‌లో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 96, 551 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 1,209 మంది మరణించారు. నిన్న 70,880 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,62,415కి చేరింది. కరోనాను జయించి 35,42,664 మంది పూర్తిగా కోలుకున్నారు. వైరస్‌తో పోరాడుతూ 76,271 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనదేశంలో 9,43,480 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

    టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో మనదేశంలో 11,63,542 శాంపిల్స్ పరీక్షించారు. భారత్‌లో ఇప్పటి వరకు 5 కోట్ల 40 లక్షల 97,975 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 9,90,795 మందికి కరోనా సోకగా.. 28,282 మంది మరణించారు. ఇక రెండో స్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 5,37,687 కేసులు నమోదవగా.. 4,702 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, యూపీ రాష్ట్రాలున్నాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Coronavirus, Supreme Court

    తదుపరి వార్తలు