• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • FIVE MUST KNOWN FACTS ABOUT CORONA KAVACH POLICY NO NEED TO FEAR ABOUT COVID 19 TREATMENT FULL DETAILS HERE GH HSN

Corona Kavach Policy: కరోనా వస్తే చికిత్సకు డబ్బులెలా అని భయపడుతున్నారా..? ఈ పాలసీ తీసుకుంటే ఈ ఖర్చులన్నీ ఇన్సూరెన్స్ కంపెనీదే..!

Corona Kavach Policy: కరోనా వస్తే చికిత్సకు డబ్బులెలా అని భయపడుతున్నారా..? ఈ పాలసీ తీసుకుంటే ఈ ఖర్చులన్నీ ఇన్సూరెన్స్ కంపెనీదే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజూ ఇల్లు గడిస్తేనే చాలని సామాన్య జనం భావిస్తున్నారు. పొరపాటున కరోనా కనుక వస్తే చికిత్సకు డబ్బులు ఎలా అని క్షణక్షణం భయపడిపోతున్నారు. అలాంటి వారి కోసమే కరోనా కవచ్ పాలసీ ఉంది.

  • Share this:

భారత్‌లో హెల్త్ ఇన్సూరెన్సులకు ఇప్పుడిప్పుడే ప్రజలు అలవాటు పడుతున్నారు. ఇంతకు ముందు ఉన్న పాలసీల్లో కోవిడ్-19 చికిత్స ఖర్చులను భర్తీ చేసేవి లేవు. ఈ నేపథ్యంలో ప్రతి కంపెనీ కరోనా కవచ్ లేదా స్టాండర్డ్ కోవిడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కచ్చితంగా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వివిధ సంస్థలు కరోనా చికిత్సకు ప్రత్యేకంగా పాలసీలను అందిస్తున్నాయి. కరోనా మహమ్మారి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులకు ఇవి కవరేజీ కల్పిస్తున్నాయి. వ్యక్తిగతంగా లేదా కుటుంబం మొత్తానికి కలిపి రూ.5 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు. మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు లేదా తొమ్మిదిన్నర నెలల కాల వ్యవధికి పాలసీని కొనుగోలు చేయవచ్చు. కరోనా కవచ్ పాలసీలను కొనుగోలు చేసే విండోను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. వీటి గురించి తెలుసుకోవలసిన ఐదు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.




ఎలాంటి ఖర్చులకు పాలసీ కవరేజీ వర్తిస్తుంది?
ప్రభుత్వ టెస్టింగ్ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయించుకొని, కోవిడ్ -19 నిర్ధారణ అయిన వ్యక్తులకే పాలసీ వర్తిస్తుంది. చికిత్సలో భాగంగా హాస్పిటల్‌లో చేరిన వారి మెడికల్ ఖర్చులను పాలసీ భరిస్తుంది. కోవిడ్ చికిత్సకు అయ్యే అన్ని రకాల ఖర్చులు, ఇంటి వద్ద తీసుకునే చికిత్స ఖర్చులు, ఆయుష్ ట్రీట్‌మెంట్, ఆసుపత్రికి వెళ్లడానికి ముందు అయ్యే వైద్య ఖర్చులు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత అయ్యే వైద్య ఖర్చులకు పాలసీ కవరేజీ ఉంటుంది. కానీ ఆప్షనల్ పాలసీ తీసుకునే వారికి నియమ నిబంధనలు మారుతాయి. వీరికి రోజుల వారీగా 15 రోజుల వరకు బీమా చేసిన మొత్తంలో 0.5 శాతాన్ని పాలసీలు చెల్లిస్తాయి.

ఎవరికి వర్తిస్తుంది?
18- 65 సంవత్సరాల వయసు ఉన్నవారు పాలసీని కొనుగోలు చేయవచ్చు. పాలసీ నియమ నిబంధనల ప్రకారం కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు 65 ఏళ్లు పైబడిన వారికి కూడా కవరేజీ కల్పిస్తున్నాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్రాతిపదికన కూడా పాలసీ అందుబాటులో ఉంది. దీని ప్రకారం కుటుంబ పెద్దపై ఆధారపడే పిల్లలకు (1-25 సంవత్సరాలు) కూడా పాలసీ వర్తిస్తుంది.

బీమా మొత్తం ఎంత?
కరోనా కవచ్‌లో బీమా మొత్తం రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. ఈ మధ్యలో రూ.50 వేల గుణిజాలలో బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు. పాలసీ ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి చెల్లించే అవకాశం కూడా ఉంది.

వెయిటింగ్ పీరియడ్‌?
సాధారణంగా పాలసీ కొనుగోలు చేసిన తరువాత 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే పాలసీ కొనుగోలు చేసిన 15 రోజులకు కవరేజీ అమల్లోకి వస్తుంది. కానీ రెన్యువల్ చేసే సమయంలో ఈ వెయిటింగ్ పీరియడ్ ఉండదు. ఒకవేళ బీమా మొత్తాన్ని పొడిగించుకుంటే.. అప్పుడు కూడా వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.

ఆరోగ్య కార్యకర్తలకు ప్రీమియం తగ్గింపు
హెల్త్‌కేర్ వర్కర్లు కరోనా కవచ్ పాలసీ ప్రీమియంలో ఐదు శాతం తగ్గింపు పొందవచ్చు. వైద్య సిబ్బంది, ఆరోగ్య నిపుణులు అందరూ ఈ తగ్గింపులు పొందవచ్చు.


First published: