భారత జవాన్‌కు కరోనావైరస్.. ఆర్మీలో తొలి పాజిటివ్ కేసు

జవాన్ కుటుంబలో మిగిలిన సభ్యులకు కూడా క్వారంటైన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది.

news18-telugu
Updated: March 17, 2020, 11:37 PM IST
భారత జవాన్‌కు కరోనావైరస్.. ఆర్మీలో తొలి పాజిటివ్ కేసు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌ను వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియన్ ఆర్మీకి కూడా పాకింది. లద్దాఖ్ స్కౌట్స్‌లో పనిచేసే ఓ జవాన్‌కు కోవిడ్-19 సోకిందని ANI వార్తా సంస్థ వెల్లడించింది. జవాన్ తండ్రికి కూడా కరోనా టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది.  అతడి తండ్రి ఇరాన్‌లో పర్యటించి ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చాడు.   ఈ నేపథ్యంలో జవాన్ కుటుంబలో మిగిలిన సభ్యులకు కూడా క్వారంటైన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.


మనదేశంలో ఇప్పటి వరకు 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఒక్క మహారాష్ట్రలోనే 36 మందికి వైరస్ సోకింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. దీని ప్రభావంతో ఇప్పటి వరకు 7,896 మంది చనిపోయారు. మరో లక్షా 94వేల మంది ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనాలో ఇప్పటి వరకు 3,226 మంది చనిపోయారు. చైనా తర్వాత ఇటలీలో మరణ మృదంగం మోగిస్తోంది కోవిడ్-19. ఇటలీలో ఇప్పటి వరకు 2,503 మంది మరణించారు.

First published: March 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading