హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Breaking News: ప్రపంచంలో ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం నమోదు..

Breaking News: ప్రపంచంలో ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం నమోదు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Omicron Death: ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో ఒకరు చనిపోయారని బ్రిటన్ ప్రధాని జాన్సన్ బోరిస్ తెలిపారు.

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం నమోదైంది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని జాన్సన్ బోరిస్ సోమవారం ప్రకటించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో ఒకరు చనిపోయారని తెలిపారు. గత నెలలో గుర్తించిన కరోనా కొత్త ఒమిక్రాన్.. ఇప్పటివరకు ఉన్న వేరియంట్ల కంటే చాలా వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత్ సహా అనేక దేశాలకు కొన్ని రోజుల వ్యవధిలోనే వ్యాపించిన ఈ కొత్త వేరియంట్.. ఆయా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలో 63 దేశాలకు ఈ వేరియంట్ వ్యాప్తించింది. మన దేశంలో ఇప్పటివరకు 38 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో అధికారులు దృష్టి పెట్టారు. ఒమిక్రాన్ వేరియంట్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దీని కారణంగా మరణాలు నమోదు కాకపోవడం చాలామందికి ఊరట కలిగించింది.

ఒమిక్రాన్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న దేశాల జాబితాలో బ్రిటన్, డెన్మార్క్, దక్షిణాఫ్రికా దేశాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు అందులో ఒకటైన బ్రిటన్‌లోనే ఈ వేరియంట్ సోకిన వ్యక్తి చనిపోవడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షణ పొందేందుకు బ్రిటన్ ఇప్పటికే తమ పౌరులకు బూస్టర్ డోసు ఇచ్చే ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. ఈ బూస్టర్ డోసు కరోనా కొత్త వేరియంట్ల నుంచి 75 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని యూకే ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున బూస్టర్ డోసు పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసు బుక్ చేసుకునేందుకు లక్ష మంది ప్రయత్నించడంతో.. వెబ్ సైట్ కూడా క్రాష్ అయ్యింది. అయితే బ్రిటన్‌‌లో ఒమిక్రాన్ సోకిన ఓ వ్యక్తి మరణించినట్టు ఆ దేశ ప్రధాని ప్రకటించడంతో.. ఈ వేరియంట్ ప్రమాదకరమా ? అనే చర్చ మరోసారి మొదలైంది.

Omicron: పంటి నొప్పికి చికిత్స చేయించుకుందామని వెళితే బయటపడ్డ కరోనా.. అది కూడా ఒమిక్రాన్‌..

WHO: వ్యాక్సిన్‌లు వ్యాప్తిని త‌గ్గిస్తాయి.. కానీ పూర్తిగా అడ్డుకోలేవు: డ‌బ్ల్యూహెచ్ఓ

అయితే ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకమా ? లేదా అన్నది తెలియడానికి మరికొన్ని వారాల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. మరోసారి కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించడం ద్వారా ఈ వేరియంట్ సోకకుండా జాగ్రత్త పడొచ్చని తెలిపారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించాయి. ఒమిక్రాన్ వెలుగు చూసిన దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై దృష్టి పెట్టాయి. వారికి ఎయిర్‌పోర్టులోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. పాజిటివ్ వస్తే వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నాయి. నెగిటివ్ వచ్చిన వారు సైతం క్వారంటైన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపాయి.

First published:

Tags: Omicron corona variant

ఉత్తమ కథలు