దేశంలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా కారణంగా ఓ డాక్టర్ చనిపోయిన ఘటన మాత్రం తొలిసారి నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండోర్‌లోని 62 ఏళ్ల ఓ డాక్టర్‌కు నాలుగు రోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయనను నగరంలోని అరవిందో మెడికల్ కాలేజీ హస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఆయన కరోనా పేషెంట్లకు వైద్యం చేయలేదని చెబుతున్నారు. ఆయన ఎక్కువగా మురికివాడల్లో ఉండే వారికే వైద్యం చేస్తుంటారని ఆయన సహచర వైద్యుడు తెలిపాడు.
చనిపోయిన డాక్టర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే వారంతా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వైద్యుడు చనిపోయిన ఇండోర్‌లో ఇప్పటివరకు 173 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 16 మంది చనిపోయారు. అయితే డాక్టర్‌కు ఎవరి ద్వారా కరోనా వైరస్ సోకిందనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 5,734కు చేరుకోగా, 166 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయినట్టు కేంద్రం ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.