Vijayawada Fire Mishap: విజయవాడ కొవిడ్ కేంద్రం అగ్నిప్రమాదంలో 11 మంది మృతి...

Vijayawada Fire Accident: కొవిడ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం భారీ ఎత్తున జరగడం, దానికి తోడు కరోనా రోగులు ఎక్కువగా ఉండటంతో... ప్రాణనష్టం తీవ్రంగా ఉంది.

news18-telugu
Updated: August 9, 2020, 10:35 AM IST
Vijayawada Fire Mishap: విజయవాడ కొవిడ్ కేంద్రం అగ్నిప్రమాదంలో 11 మంది మృతి...
విజయవాడ కొవిడ్ కేంద్రం అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతి... కొనసాగుతున్న సహాయచర్యలు...
  • Share this:
విజయవాడలోని కొవిడ్ చికిత్సా కేంద్రంలో ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకూ 11 మంది చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కొవిడ్ ఆస్పత్రిగా ఉన్న హోటల్‌లో ఫైర్ సేఫ్టీ చర్యలేవీ లేవనీ... అందువల్ల ప్రమాదం చాలా పెద్దది అయ్యిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. స్థానిక స్వర్ణా ప్యాలెస్ హోటల్‌ను రమేశ్ హాస్పిటల్స్, తన కరోనా చికిత్సా కేంద్రంగా వాడుతోంది. ఈ భవనంలో 30 మందికి పైగా కరోనా బాధితులు, 10 మంది దాకా వైద్యులు, కరోనా వారియర్స్ ఉన్నారు. ఇలాంటి భవనంలో ఉన్నట్టుండి... దట్టమైన పొగలు వచ్చాయి. ఆ తర్వాత మంటలూ వచ్చాయి. అసలే కరోనా సోకిన వారికి ఊపిరి సరిగా ఆడదు. దానికి తోడు పొగ కూడా యాడ్ అవ్వడంతో... రోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఊపిరాడని బాధితులు కిటికీల దగ్గరకు వచ్చి కేకలు వేశారు. తీవ్ర ఆందోళన చెందారు. మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతూ... దాదాపు భవనాన్ని చుట్టుముట్టాయి.

vijayawada, corona virus, fire accident, covid centre, fire engines, ap news, telugu news, విజయవాడ, అగ్నిప్రమాదం, కొవిడ్ కేంద్రం, మంటలు, ఫైర్ సిబ్బంది, ఏపీ న్యూస్,
అగ్నిప్రమాద దృశ్యాలు


విషయం తెలుసుకున్న అగ్నిమాపక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. భారీ ఆపరేషన్ నిర్వహించి మంటల్ని అదుపులోకి తెచ్చాయి. మొత్తం ఆరు ఫైర్ ఇంజిన్లను ఉపయోగించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఐతే... అప్పటికే... చాలా వరకూ పొగ ఆస్పత్రి అంతటా వ్యాపించింది. కొందరు బాధితులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఏడుగురు పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు రోగుల పేరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. స్వర్ణప్యాలెస్‌ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేషెంట్ల తరలింపు కొనసాగుతోంది.

కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు అనుకుంటున్నారు. పోలీసులు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: August 9, 2020, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading