Coronavirus-Sniffing Dogs: మీరు కరోనా పేషెంటా? ఈ కుక్కలు గుర్తుపట్టేస్తాయ్

ప్రస్తుతం హెల్సింకి విమానాశ్రయంలో 2 షిఫ్టుల్లో పనిచేసేందుకు గాను నాలుగు స్నిఫర్ కుక్కలు రంగంలోకి దిగాయి. ఒక షిఫ్టులో రెండు కుక్కలు డ్యూటీలో ఉంటాయి.

news18-telugu
Updated: September 24, 2020, 4:41 PM IST
Coronavirus-Sniffing Dogs: మీరు కరోనా పేషెంటా? ఈ కుక్కలు గుర్తుపట్టేస్తాయ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు లాక్డౌన్ వంటి ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఈ మహమ్మారి మాత్రం కంట్రోల్ కావడం లేదు. దీంతో వైరస్ కట్టడికి ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో రోగులను గుర్తించడమే వైరస్ నివారణకు మొదటి మార్గంగా మారింది. ఈ నేపథ్యంలో మహమ్మారి నివారణకు ప్రపంచ దేశాలు వివిధ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫిన్లాండ్ దేశం కొత్త రకమైన వ్యూహాన్ని అమలు చేస్తుంది. కరోనా రోగులను గుర్తించేందుకు ఫిన్లాండ్ ప్రభుత్వం ఏకంగా కుక్కలను రంగంలోకి దింపింది. ఫిన్లాండ్ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా సోకిన ప్రయాణికులను గుర్తించడానికి ఈ కుక్కలను సిద్ధం చేశారు. కరోనా రోగులను గుర్తించేందుకు నార్డిక్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగు నెలల పాటు ప్రయోగాత్మకంగా ఇవి శిక్షణ పొందాయి. ప్రస్తుతం నాలుగు కుక్కలు ఫిన్లాండ్ దేశంలోని హెల్సింకి విమానాశ్రయంలోకి వచ్చే కరోనా రోగులను గుర్తించే పనిలో పడ్డాయని అక్కడి అధికారులు ప్రకటించారు. ‘‘కుక్కలు వాసన పసిగట్టడంలో బాగా పనిచేస్తాయి. ఈ ప్రక్రియ ఖచ్చితమైన ఫలితాలనిస్తుంది”అని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి చెందిన ఈక్వైన్ అండ్ స్మాల్ యానిమల్ మెడిసిన్ ప్రొఫెసర్ అన్నా హిల్మ్ జోర్క్మాన్ తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం


ఈ ప్రక్రియ విజయవంతమైతే హాస్పిటల్స్, పోర్టులు, ఓల్డేజ్ హోమ్స్, క్రీడా వేదికలు, కల్చరల్ ఈవెంట్స్ జరిగే ప్రదేశాల్లో కూడా దీన్ని అమలు చేయనున్నారు. కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కుక్కలను రంగంలోకి దింపింది. ఆ తర్వాత ఫిన్లాండ్ దేశంలో కూడా ఇలాంటి తరహా వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనా రోగులను గుర్తించేందుకు కుక్కలను వినియోగిస్తున్నారు. హెల్సింకి విమానాశ్రయంలో స్వచ్ఛంద కార్యక్రమం కింద ఉచిత కరోనా పరీక్ష చేయించుకోవడానికి అంగీకరించిన ప్రయాణీకులకు జాగిలాలతో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా వైరస్ సోకిన రోగిని గుర్తించడానికి కుక్కకు కేవలం10 సెకన్ల సమయం మాత్రమే పడుతుందని అధికారులు తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం


ప్రస్తుతం హెల్సింకి విమానాశ్రయంలో 2 షిఫ్టుల్లో పనిచేసేందుకు గాను నాలుగు స్నిఫర్ కుక్కలు రంగంలోకి దిగాయి. కాగా ఒక షిఫ్టులో రెండు కుక్కలు డ్యూటీలో ఉండగా, మిగిలిన రెండు రెస్ట్ తీసుకుంటాయని అధికారులు వెల్లడించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 24, 2020, 4:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading