ఇంటి ముందు దిష్టిబొమ్మను కట్టి.. కరోనా నుంచి రక్షణకై కంబోడియా ప్రజల వినూత్న పంథా

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ కంబోడియా వంటి కొన్ని దేశాల్లో మాత్రం అంతలా ప్రభావాన్ని చూపలేకపోతుంది.

news18-telugu
Updated: October 12, 2020, 10:29 PM IST
ఇంటి ముందు దిష్టిబొమ్మను కట్టి.. కరోనా నుంచి రక్షణకై కంబోడియా ప్రజల వినూత్న పంథా
ఫొటో క్రెడిట్-AFP video
  • Share this:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆయా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. దీంతో కరోనా వ్యాక్సీన్పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ కంబోడియా వంటి కొన్ని దేశాల్లో మాత్రం అంతలా ప్రభావాన్ని చూపలేకపోతుంది. దీనికి గల ప్రధాన కారణం అక్కడి ప్రజలు అనుసరిస్తున్న మూఢ నమ్మకాలే అంటే ఆశ్చర్యం కలుగక మానదు.ఈ నమ్మకాలే కరోనా నుండి తమను రక్షిస్తున్నాయని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. కరోనా నుంచి బయటపడడానికి వారు ఫాలో అవుతున్న మూఢ నమ్మకాల గురించి తెలుసుకుందాం.

రూరల్ రిటువల్

కరోనావైరస్ నుండి బయటపడటానికి కంబోడియా దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు వినూత్నమైన చర్యను అవలంభిస్తున్నారు. దిష్టిబొమ్మ తలపై ప్లాస్టిక్ -కుండను తగిలించి, తమ ఇళ్ల ముందు ఎంట్రన్స్ దగ్గర పెడతారు. ఈ మూఢ నమ్మకాన్ని ప్రధానంగా రైతులు అనుసరిస్తున్నారు.

టింగ్ మోంగ్
"టింగ్ మోంగ్" అని పిలిచే మనిషి ఆకారంలో ఉండే దిష్టిబొమ్మను ఇంటి బయట ఎంట్రన్స్‌లో పెడుతున్నారు. తరచుగా డెంగ్యూ, నీటి ద్వారా వచ్చే అంటు వ్యాధులు సంభవించే గ్రామాల్లో దీన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు.

అదనపు రక్షణ
కంపాంగ్ చం ప్రావిన్స్‌లోని ప్రజలు దీన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. దీనిలో భాగంగా తమ ఇంటి ఎంట్రన్స్‌లో కనీసం రెండు దిష్టిబొమ్మలను పెడుతున్నారు. దీంతో వారి కుటుంబాలు ఘోరమైన వైరస్ల నుండి సురక్షితంగా ఉంటాయని వారి నమ్మకం.

వైరస్ నుంచి రక్షణకై సైన్యం
మెజారిటీ ప్రజలు తాము నెలకొల్పే దిష్టిబొమ్మలకు సాధారణ చెక్ షర్టులతో సహా సాదా దుస్తులు ధరింపజేస్తుండగా, కొంతమంది ప్రజలు మాత్రం సైనిక సిబ్బంది వలె కామో-గ్రీన్ రంగులో ఉన్న దిష్టిబొమ్మలను తమ ఇంటి ముందు నెలకొల్పుతున్నారు.

వైరస్ కోసం విరుగుడు
వైరస్ విరుగుడుకు కొంతమంది ప్రజలు టింగ్ మోంగ్స్గా పిలిచే దిష్టిబొమ్మలను ఇంటి ముందు పెడుతున్నారు. ఇవి వైరస్ భారీన పడని కుటుంబానికి హాని కలిగించాలని చూసే దుష్టశక్తుల నివారణకు ఉద్దేశించబడింది. కాబట్టి, వైరస్ నుండి తమను రక్షించడానికి వచ్చిన బలమైన టీకా ఇదేనని స్థానికులు భావిస్తారు. దీనిపై ఒక స్థానికుడు మాట్లాడుతూ ‘‘దీన్ని మా ఇంటి ఆవరణలో నెలకొల్పడం మూలాన కోవిడ్ వ్యాప్తి నుంచి దూరంగా ఉన్నాము. కరోనా మహమ్మారి ఉన్నంతవరకు నేను దీన్ని మా ఇంటి ముందు కొనసాగిస్తా.’’ అని పేర్కొన్నాడు.
Published by: Sumanth Kanukula
First published: October 12, 2020, 10:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading