హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న వారిలో 15 మందికి కరోనా వైరస్ సోకింది. గతంలో 10 మందికి కరోనా నిర్ధారణ కాగా, ఈరోజు మరో ఐదుగురు వైరస్ బారిన పడ్డారు. ఓ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు కరోనా వైరస్ బారిన పడినట్టు ధ్రువీకరించారు. అందరినీ స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా వైద్యాధికారులు సూచించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అధికారులు, సిబ్బంది కలిపి మొత్తం 150 మంది వరకు విధులు నిర్వహిస్తూ ఉంటారు. వారిలో ఇప్పటి వరకు 50 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు తెలంగాణలో కరోనా లక్షణాలు ఉన్న పోలీసులు అందరూ సెలవు తీసుకుని ఇళ్ల వద్దే ఉండాలని, విధులకు హాజరు కావొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad police, Telangana, Telangana Police, TS Police